Thursday, May 8, 2025
- Advertisement -

ఏపీ ఫైబర్ స్కామ్…ఇక లోకేష్ వంతు వచ్చేసింది!

- Advertisement -

అవినీతి ఆరోపణల్లో పూర్తిగా కూరుకుపోయింది టీడీపీ. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు లోకేష్ వంతు వచ్చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మళ్లింపు, ఫైబర్ నెట్ పనుల్లో అవినీతి జరిగిందని తమ విచారణలో తేలిందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఈ స్కామ్‌లో లోకేష్‌ని సైతం విచారించాలని కుంభకోణంలో ఆయన పాత్ర ఏంటనే దానిపై తేలుస్తామన్నారు.

దీంతో లోకేష్ అరెస్ట్ కూడా ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం సంగతేమో కానీ ఒక్కొక్కటిగా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్న పనులపై ఆరోపణలు రాగా వాటిని కప్పిపుచ్చారు చంద్రబాబు. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో అన్ని పనులపై విచారణ చేపట్టింది. దీంతో ఒక్కొక్కటిగా బాబు బాగోతాలు బయటకు వస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు అంతా చంద్రబాబు అరెస్ట్ గురించే మాట్లాడుకోగా తాజాగా ఆయన తనయుడు లోకేష్ పేరును సీఐడీ అధికారులు వెల్లడించడం టీడీపీ నేతలను షాక్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్నారు లోకేష్‌. రెడ్ బుక్ చేతిలో పట్టుకుని అవినీతి అధికారుల భరతం పడతానని హెచ్చరించారు. అయితే ఇప్పుడు లోకేషే అవినీతిలో భాగస్వామిగా ఉన్నారని సీఐడీ అధికారులు తేల్చడంతో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.త్వరలోనే లోకేష్‌ని కూడా అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉండటంతో ఎన్నికల వేళ టీడీపీకి ఇది ఇబ్బందికరంగా మారింది. ఇక ఆర్ధిక కుట్ర నిజమైతే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేగాదు ఇది నాన్ బెయిలబుల్ కేసు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే తండ్రి,కొడుకులు జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -