ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ పొరబడడం అది సోషల్ మీడియాలో జోకులు పేలడం సర్వసాధారణం. అతడు అనాలోచితంగా మాట్లాడే మాటలు అధికార పార్టీకి, లోకేశ్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో పప్పుగానే ముద్ర పడిపోతున్నాడు. ఇప్పుడు తాజాగా మంగళవారం (ఏప్రిల్ 3) అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి తడబడ్డారు. ఆ తర్వాత వాస్తవం గ్రహించుకొని తప్పు సరిదిద్దుకున్నారు.
అసెంబ్లీలో గ్రామీణ తాగునీటి పథకాలపై లఘు చర్చ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై లోకేశ్ మాట్లాడారు. చివరగా తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ మాట్లాడాడు. ‘నాపై వచ్చిన ఆరోపణల్లో అవాస్తవాలు లేకపోయినా బురద జల్లుతున్నారు’ అని చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు అర్థం కాక విస్తుపోయారు. అవాస్తవాలు లేకపోయినా అంటే వాస్తవాలు అనే అర్థం వస్తుంది. అంటే తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమే అని పరోక్షంగా చెప్పినట్టు అవుతోంది.
దీంతో లోకేశ్ వెంటనే తేరుకుని ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే ప్రజల మధ్య చర్చిద్దామని సరి చేసుకుని మాట్లాడారు. ఇంకోసారి కూడా తడబడ్డాడు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయమై మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలో అనే పదాన్ని ఐటీపీఏ అని చదివాడు. ఈ విషయం గమనించిన పక్కనున్న ఎమ్మెల్యేలు సవరించి చెప్పడంతో చివరికి ఐటీడీఏ అని చెప్పాడు.