Friday, April 26, 2024
- Advertisement -

తోడుదొంగల దొంగాట….. 2019లో కూడా జగన్‌ని ఓడిస్తుందా?

- Advertisement -

రాజకీయాల వరకూ వైఎస్‌ల గురించి కొన్ని విషయాల్లో గొప్పగా చెప్తుంటారు సీనియర్ జర్నలిస్టులు. ఇద్దరూ కూడా పట్టుదలగా, కష్టపడి ప్రజాభిమానం పొందాలనే కృషి చేయాలనుకుంటారు. అలాగే ప్రజలను మోసం చేసి, అబద్ధపు హామీలతో కుర్చీ ఎక్కాలని ఆశించారు. ఇంకెవరి పదవినో లాక్కోవాలనో, వెన్నుపోటు రాజకీయాలో, కుట్ర రాజకీయాలో చేసే నైజం ఇద్దరికీ లేదు. ఇక నాయకులకు సీటు విషయంలో ఇచ్చిన హామీని కూడా కచ్చితంగా నిలబెట్టుకుంటారు. అదే చంద్రబాబుతో సహా పవన్‌ని కూడా ఈ విషయంలో నమ్మలేని పరిస్థితి. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంతమందికి సీటు హామీ ఇచ్చి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడు పవన్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, డైరెక్ట్ రాజకీయాలు చేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌లిద్దరిదీ కూడా రాజమార్గమే.

అయితే దొడ్డిదారి రాజకీయాలు, దొంగ రాజకీయాలు ఎదుర్కోవడం వైఎస్ రాజశేఖరరెడ్డి సక్సెస్ అయ్యాడు. కానీ జగన్ మాత్రం తడబడుతున్నాడు. ఎపిలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన భజన మీడియా ఆడించినట్టుగా ఆడుతూ సమైక్యాంధ్ర ఛాంపియన్ అని చెప్పుకుంటూ రాయలసీమ నేత, ఉద్యోగ సంఘాల నేత ఆడిన డ్రామాను ఎదుర్కోవడంలో 2014 ఎన్నికలకు ముందు ఫెయిల్ అయ్యాడు జగన్. ఇక ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘాల నేత టిడిపిలో చేరడం ఖాయం అయింది. అయితే సమైక్యాంధ్ర ఛాంపియన్ అని చెప్పుకుంటూ చివరి వరకూ పదవిని పట్టుకుని వేలాడి ప్రజలను మోసం చేసిన నాయకుడు ఇప్పుడు మరోసారి జగన్‌ని దెబ్బకొట్టడానికి రెడీ అయిపోయాడు.

సీనియర్ మోస్ట్ నాయకుడిని అని చెప్పుకునే నాయకుడు చెప్పినట్టుగా దొంగాట ఆడడానికి రెడీ అవుతున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్‌కి నష్టం చేసేలా సీనియర్ మోస్ట్ నాయకుడిని అని చెప్పుకునే నాయకుడితో కలిసి దొంగాట ఆడడానికి రెడీ అయ్యాడు. రెడ్డి కులస్థుడైన ఆ నాయకుడు రెడ్డి కులస్థుల ఓట్లు, రాయలసీమ ఓట్లు చీల్చేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నాడు. మరి ఈ సారి అయినా ఈ దొంగాటలు, కుట్ర రాజకీయాలను జగన్ ఎదుర్కోగలడా? ప్రత్యేక హోదా హామీ, మోడీది-తనది అభివృద్ధి జోడి, రుణమాఫీ హామీలతో పాటు 2014ఎన్నికల్లో అబద్ధపు రాజకీయానికి, కుట్ర రాజకీయాలకే పట్టం కట్టారు ప్రజలు. మరి ఈ సారి అయినా పరిస్థితులు మారతాయా? దొంగ రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారా? జగన్ ఏ మేరకు ఈ రాజకీయాలను ఎదుర్కొని నిలబడగలడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -