Thursday, May 2, 2024
- Advertisement -

దైర్యానికి నిలువెత్తు రూపం వైఎస్ జ‌గ‌న్

- Advertisement -

ఎప్పుడు విమ‌ర్శ‌లు, స‌వాళ్ల‌తో ప్ర‌భుత్వానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తన‌లోని సాహ‌సాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి స్వయంగా వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జాసంకల్ప యాత్రం 207వ రోజుకు చేరుకుంది. అయితే ఈ నేప‌థ్యంలో గ‌త కొన్ని రోజులుగా వైఎస్ జ‌గ‌న్ కు సంబంధించిన ఓ వీడియా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజ‌న్లు వైఎస్ జ‌గ‌న్ సాహ‌సానికి ఫిదా అవుతున్నారు.

2017లో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు జ‌గ‌న్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో త‌న‌కిష్ట‌మైన బంగీ జంప్ చేసి ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

గ‌తంలో మెగ‌స్టార్ చిరంజీవి బావ‌గారు బాగున్నారా సినిమాలో చ‌ల్నే దో గాడీ పాట‌లో బంగీ జంప్ చేశారు.ఆ త‌రువాత చాలా మంది చేశారు కానీ రాజ‌కీయ నాయ‌కులు ఈ సాహాసాన్ని చేసింది లేదు. కానీ జ‌గ‌న్ మాత్రం న్యూజిల్యాండ్ ప‌ర్య‌ట‌న‌లో కవెరో బ్రిడ్జి నుంచి బంగీ జంప్ చేశారు. తన కుటుంబంతో కలిసి పాదయాత్రకు ముందు సరదాగా న్యూజిలాండ్ వెళ్లిన జగన్.. అక్కడి కవెరో బ్రిడ్జి పై నుంచి ఈ సాహసం కృత్యం ప్రదర్శించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోపై వెఎస్ జ‌గ‌న్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆ గుండెకు తెలిసింది ఒక్కటే దమ్ము దైర్యం, ఢిల్లీ గద్దెని డి కొట్టినా, సాహసం తో కూడీన ఆటలు ఆడాలన్నా, తెగించి ప్రజలకోసం వేల కిలోమీటర్లు నడవాలి అన్న బలమైన గుండె ధైర్యం కావాలి ఆ తెగింపు ఆ సాహసం ఒక్క జగన్ అన్న కె సొంతం. అందుకే ఆయన జీవితమే ఒక సహాస యాత్ర ..ఓ నాయకుడా సలాం.

పార్టీకి సంబంధం లేదన్నారు గా, కానీ ఇది మా క్రెడిబిలిటీ, బ్రాండ్, కెపాసిటీ, టీం వర్క్, వైఎస్సార్ కుటుంబం మామీద ఉంచిన నమ్మకం. మమ్మల్ని వైఎస్సార్ కుటుంబం నుండి ఎవడూ విడదీయలేడు, ఎవరో నలుగురు బోకు వెధవలు వాళ్ళ బోకు జోకులతో వాళ్ళలో వాళ్ళే నవ్వుకోటానికి తప్ప ఆ పేపర్ ముక్క మాకు వైఎస్సార్ కుటుంబం తో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికి ఎప్పటికి విడదీయలేర‌ని అభిమాని ర‌వీంద్ర ఇప్పాల ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి ఏ నాయ‌కుడు చేయ‌ని సాహ‌సం చేసిన జ‌గ‌న్ బంగీ జంప్ వీడియాలో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -