Monday, May 5, 2025
- Advertisement -

ఉత్తమ సేవలు.. అవార్డులు.. శోభ వాతావరణం..!

- Advertisement -

విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా.. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డులను అందజేశారు. జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. శాలువాలు కప్పి, మెడల్​తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటీర్లు వ్యవస్థకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంకురార్పణ చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎన్నో ఆరోపణలు చేసిన వాళ్ళే.. ఇప్పుడు శభాష్ అంటున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, జిల్లా వైకాపా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్, సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాజకుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్‌ !

‘వకీల్ సాబ్’ కి అక్కడ షాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -