Saturday, May 18, 2024
- Advertisement -

బెట్టింగుల్లోకి విదేశీయులు కూడా

- Advertisement -

నంద్యాల ఉపఎన్నికలో గెలపుకు ప్రధాన పార్టీలు నానా అవస్తలు పడుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ఎన్నికల సెగ బాగా ఎక్కువైపోతోంది. ఇది ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు పార్టీలు, అభ్యర్ధుల ప్రచారానికి సమాంతరంగా బెట్టింగుల జోరు పెరిగిపోతోంది. ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది? ఇద్దరి అభ్యర్ధుల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? గెలిచే అభ్యర్ధికి వచ్చే మెజారిటీ ఎంత? అనే అంశాలపై బెట్టింగ్ రాయళ్ళ హడావుడి పెరిగిపోతోంది.

విషయమేమిటంటే బెట్టింగుల్లోకి విదేశీయులు కూడా ఆశక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగానే విదేశాల్లోని బెట్టింగ్ రాయళ్ళ హడావుడి కనిపిస్తుంటుంది. కాకపోతే ఈసారి ఉపఎన్నికలోకి కూడా విదేశాల్లో ఉండేవారు దిగారు. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచే అభ్యర్ధులు, పార్టీలపై బెట్టింగ్ జోరు సాగింది. మొదటిసారిగా ఓ ఉపఎన్నికలో బెట్టింగ్ జోరు పెరిగిపోతుండటం గమనార్హం. ఎన్నిక తేదీ దగ్గర పడేకొద్దీ బెట్టింగ్ మొత్తం పెరుగుతోంది.

వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి గెలుపుపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ. 5 లక్షలపైనే బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మొదట్లో శిల్పా గెలుపుపై రూ. 1 లక్ష మాత్రమే ఉన్న బెట్టింగ్ తాజాగా రూ. 5 లక్షలకు చేరుకుంది.కొంద‌రు స‌న్నిహితుల ద్వారా,మ‌రొ కొంద‌రు మీడియా మిత్రుల ద్వారా గెలుపు స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు.

23వ తేదీ పోలింగు దగ్గర పడేకొద్దీ బెట్టింగుల జోరు, మొత్తం పెరుగుతుండటం గమనార్హం. ఎన్నికలో గెలపుకు అభ్యర్ధులు, పార్టీలు నానా అవస్తలు పడుతుంటే వారిపై బెట్టింగులు కాసే వారు ఎక్కువైపోతున్నారు. నంద్యాల ఉప ఎన్నికా..మ‌జాకా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -