Friday, May 10, 2024
- Advertisement -

పీకె అండ్ పీకె 2019 ఎన్నిక‌ల్లో తోపు ఎవ‌రు..?

- Advertisement -

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా బాబు, జ‌గ‌న్ ల పేర్ల కంటె మ‌రో ఇద్ద‌రి పేర్లు పాపుల‌ర్ అయ్యాయి. వాల్లు ఎవ‌రొ కాదు పీకే అండ్ పీకే. ఇదేదొ పీకే సినిమా అనుకుంటె పొర‌పాటు. ఇక్క‌డ పీకే అంటే.. ఒకరు ప్రశాంత్ కిశోర్.. ఇంకొకరు పవన్ కల్యాణ్. వీల్లిద్ద‌రి వ్యూహాలే 2019 ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములను నిర్న‌యించేది. ఇద్ద‌రు ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్రశాంత్ కిశోర్… ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో పేరు సంపాదించారు. 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడంలో ఈ పీకేదే కీలక పాత్ర. ఆ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బీహార్ ఎన్నికల్లో జేడీయూకు పనిచేశారు. అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బోల్తా పడ్డారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం వేసిన ఎత్తులు పైఎత్తులు బీజేపీ ముందు చిత్తయ్యాయి.

ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకోసం పనిచేస్తున్నారు. జ‌గ‌న్ ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీని మాత్రమే నమ్ముకున్నారు. సాధారణంగా ఎవరి మాటా వినరని పేరొందిన జగన్.. పీకే ఏం చెప్తే అది చేసేందుకు రెడీ అయిపోయారు. పీకే చెప్పారని పాదయాత్రకూ సిద్ధమైపోయారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ లెవల్ లో పార్టీ ప‌రిస్థితుల‌ను పీకే అండ్ టీం స్టడీ చేస్తోంది. ఇప్పటికే ఓ దఫా సర్వే పూర్తి చేసిన పీకీ టీం… పార్టీ పరిస్థితిని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కష్టమని… సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని జగన్ కు స్పష్టం చేశారు.

జగన్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పెద్ద మొత్తం తీసుకుంటున్న ప్రశాంత్ కిశోర్.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయడం కంటే పొత్తులు పెట్టుకుంటే బెటరని ఇప్పటికే సూచించారు. వైసీపీ.. ఇప్పుడు భాజాపా ద‌గ్గ‌ర‌ సాగిలపడిపోయింది. అటు జనసేనకూ వెల్ కమ్ చెప్పింది.

ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గురించి చెప్పాలంటె… రాజ‌కీయ అనుభ‌వంలేదు… ఎప్పుడు స్పందిస్తారొ తెల‌యిదు. తనకు నచ్చింది చేస్తారు. తాను నమ్మిందే సిద్ధాంతమంటారు. మిగిలిన పొలిటికల్ పార్టీల మాదిరి కాకుండా థింక్ డిఫరెంట్ అనేది ఈ పీకే స్ట్రాటజీ.

పొలిటికల్ పార్టీ నేతలు.. స‌మ‌స్య‌లున్న చోటికి వ‌స్తారు… బాధితుల‌ను ప‌రామర్శిస్తారు… త‌ర్వాత దాన్ని మ‌ర‌చిపోవ‌డం మామూలె. కానీ ఈ పీకే అలా కాదు.. దాన్ని మూలాలతో సహా పెకలించే వరకూ పట్టువదలరు. ఇప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్యలపై పవన్ స్ట్రాటజీని చూస్తే.. పవన్ ఎంత దీర్ఘాలోచనతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

వన్ కల్యాణ్ సినిమా రంగంలో ఉండడంతో స్వతహాగానే ఆయనకు బీభత్సమైన పాపులారిటీ ఉంది. దాన్ని అడ్డుకోవడం ఎవరివల్లా కాదు. పవన్ ఓ పిలుపిస్తే చాలు.. గుడ్డిగా దాన్ని నమ్మి, ఫాలో అయ్యే ఫ్యాన్స్ లక్షలాది మంది ఉన్నారు. ఇది పవన్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్

అన్నింటికీ మించి పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. కానీ పవన్ మాత్రం కులాలు, మతాలకు దూరం. తానెప్పుడూ కాపునని ప్రకటించుకోలేదు. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో గంపగుత్తగా టీడీపీ, బీజేపీకి సీట్లు వచ్చాయంటే అది పవన్ పుణ్యమే. పవన్ పిలుపుమేరకు అక్కడి కాపులందరూ ఆ రెండు పార్టీలకు ఓట్లేశారు. అదీ పవన్ లెక్క.

మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మ‌రి ఇద్ద‌రిలో తోపు ఎవ‌రొ తెలియాలంటె వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -