ఏపీ భాజాపా సొంత పార్టీ ఎంపీకీ షాక్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను దూరంగా పెట్టారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు. అందుకు తగ్గట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కంభంపాటే కొనసాగారు. మరో సారి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని చేసిన ప్రయత్నాలను అధిష్టానం గండి కొట్టింది. ఆయన స్థానంలో కన్నా లక్ష్మినారాయణను అధ్య క్షుడిగా నియమించింది.
2014 ఎన్నికల్లో కలసి ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలకు ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను భాజాపాలోని కొందురు నాయకులు బామాటంగానే విమర్శించారు. వారిలో సోము వీర్రాజు ఒకరు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింన తర్వాత జరిగిణ పరిణామాలు అదరికీ తెలిసిందే.
తర్వాత జరిగిన పరిణామాల వల్ల టీడీపీ, భాజాపా విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత ఏపీలో సొంతంగా ఎదగాలని పార్టీ అధినాయకత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే ఎంపీ కంభంపాటిని దూరంగా పెడుతోంది. ఆయన మొదటినుంచి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపనలు ఉన్నాయి. టీడీపీతో భాజాపా వేరయిన తర్వాత కూడా కంభంపాటి బాబుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు.
ఇలా ఉంటే ఏపీలో భాజాపా ఎదగలేదని ….సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనను కాదని వేరే వ్యక్తికి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గాలకు కన్వీనర్ లను నియమించారు. కాగా.. విశాఖ కన్వీనర్ గా కంభంపాటిని కాదని.. కాశీ విశ్వనాథరాజుని నియమించారు. వచ్చే ఎన్నికల్లో సీటు కూడా కంభంపాటిని కాదని.. విశ్వనాథరాజుకే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.