Monday, June 17, 2024
- Advertisement -

అమీత్‌షా ఒక్క మాటతో కంగుతిన్న మంత్రి కామినేని…

- Advertisement -

ఏపీలో మిత్ర‌ప‌క్షాలు భాజాపా-టీడీపీ మ‌ధ్య ఆదిప‌త్య‌పోరు కొన‌సాగుతోంది. భాజాపాలోని కొంద‌రు నేతలు బాబును విమ‌ర్శిస్తుంటే..మ‌రి కొంత మంది నేత‌లు బాబుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో భాజాపా అధిష్టానం గుర్రుగా ఉంది. తాజాగా మంత్రి కామినేని శ్రీనివాసరావును దూరంగా ఉంచటం ద్వారా చంద్రబాబుకు బిజెపి అధిష్ఠానం షాక్ ఇచ్చింద‌నే వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

మొద‌టినుంచి మంత్రి కామినేని చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండ‌టంపై మంత్రిమీద బిజెపి అధిష్టానం మొదటినుండి గుర్రుగానే ఉంది మ‌నిషిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వరలో కామినేని బిజెపిలో నుండి టిడిపిలోకి వెళ్ళిపోవటం ఖాయంగా తెలుస్తోంది. అదే సమాచారం పార్టీ జాతీయ నాయకత్వం వద్ద కూడా ఉంది. తాజాగా ఢిల్లీ వెల్లిన మంత్రికి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింద‌ట‌.

అస‌లు విష‌యానికి వ‌స్తే చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో బిజెపి తరపున పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు మంత్రులుగా ఉన్నారు. అయితే, కామినేని పేరుకే బిజెపి కానీ దాదాపు చంద్రబాబు మనిషిగానే వ్యవహరిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపి నుండి బిజెపిలోకి వచ్చి కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. వెంకయ్యనాయుడు చలవతో మంత్రి కూడా అయిపోయారు.

వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోయారో అప్పటి నుండి కామినేనికి ఇబ్బందులు మొదలయ్యాయి. దానికితోడు ఈమధ్యలో బిజెపి-టిడిపి సంబంధాలు క్షీణించిన సంగతి అందరూ చూస్తున్నదే. చంద్రబాబుపై బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు ఒంటికాలిపై లేస్తున్నారు. వీర్రాజుకుతోడు పురందేశ్వ‌, క‌న్నాలాంటి వారు స‌మ‌యం వ‌చ్చ‌న‌ప్పుడు బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దాంతో వీర్రాజు మీద చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు, బిజెపిలోని చంద్రబాబు మద్దతుదారులందరూ మండిపోతున్నారు. అయితే కామినేని మాత్రం బాబును ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మాట‌కూడా అన‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

వీర్రాజుకు చెక్ పెట్టేందుకు అందరూ కలిసి మంత్రిని రంగంలోకి దింపారట. వీర్రాజుపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేద్దామని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అపాయిట్మెంట్ కూడా తీసుకున్నారు. ఢిల్లీకి చేరుకుని వెంటనే షా కార్యాలయానికి చేరుకున్నారు. అమిత్ షా దగ్గర నుండి కబురు రాగానే కామినేని వెంటనే ఆయన ఛాంబర్లోకి వెళ్ళారు.

కామినేనిని చూడగానే ‘కామినేని గారు టిడిపిలోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు’ అన్న అర్దం వచ్చేట్లుగా షా పలకరించారట. షా దెబ్బకు ఖంగుతిన్న కామినేని అక్కడే ఉంటే ఇబ్బందులు తప్పవని గ్రహించి అమిత్ షాకు ఓ నమస్కారం పెట్టేసి వెంటనే అక్కడి నుండి బయటపడ్డారట. తాను వెళ్ళింది ఒకందుకైతే ఎదురైన అనుభవంతో బుర్ర గిర్రున తిరిగి వెంటనే విజయవాడ చేరుకున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -