Monday, June 17, 2024
- Advertisement -

పార్టీని బిజెపిలో కలిపేయమన్నారన్న పవన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

- Advertisement -

ప్రధానమంత్రి పదవి చేపట్టమని తనను బ్రతిమిలాడారు…….. కానీ తెలుగువాళ్ళ ప్రయోజనం కోసం అని నేనే నో చెప్పా అన్న బాబు డైలాగ్ గుర్తుందా? పనిలో పనిగా లోకేష్‌కి కూడా కాస్త క్రెడిట్ ఇస్తూ చెడ్డీలేసుకునే వయసులోనే…. ‘నాన్నా ప్రధాని పదవి వేస్ట్….. ముఖ్యమంత్రి పదవి బెస్ట్…..’ అని తన పుత్రరత్నం తనకు మేథావి(?)లా ఆలోచించి సలహా ఇచ్చాడని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చాడు. అఫ్కోర్స్……బాబు మాటలు విన్న ఢిల్లీ స్థాయి రాజకీయ మేధావులు, ప్రజలు కూడా పగలబడి నవ్వుకున్నారనుకోండి. కానీ బాబుకి అలాంటివి ఏమీ పట్టవు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు విజయం సాధించినా ఆ క్రెడిట్ నాదే అని చెప్పుకునే తరహాలోనే ఇలాంటివి చెప్పుకుంటూ పోతాడు. నవ్వుకునేవాళ్ళు కూడా ఉన్నప్పటికీ బాబు గొప్పదనాలు గురించి గుడ్డిగా నమ్మే కొంత మందిని మరింత మూఢ నమ్మకం దిశగా నడిపంచడమే బాబు టార్గెట్.

చంద్రబాబు విషయం పక్కనపెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలానే తయారయ్యాడా అనే అనుమానం వస్తోంది. సినిమాల్లో ఉన్నంత కాలం నిజాయితీ నిజాయితీ అని బోలెడంత పబ్లిసిటీ చేయించుకున్నాడు పవన్. బండ్ల గణేష్ లాంటి కమెడియన్ నుంచీ త్రివిక్రమ్ లాంటి మాటల మాంత్రికుడి వరకూ అందరి చేతా పొడిగించుకున్నాడు. అయితే ఆ నిజాయితీ అంతా డొల్లేనని 2014లో బాబు అధికారం చేపట్టిన తర్వాత నుంచీ పవన్ మాటలు, చేతలు పరిశీలిస్తున్న వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతూనే ఉందనుకోండి. మిగిలిన ఆ కాస్తా కూడా పూనం కౌర్ ఇష్యూతో పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా పవన్ చెప్పిన మరో పెద్ద అబద్ధం బయటపడింది. జనసేన పార్టీని బిజెపిలో కలిపేయమని అమిత్ షా అడిగాడని ఆ మధ్య పవన్ చెప్పుకున్నాడు. అన్న చిరంజీవిలాగే పవన్ కూడా ఏదో ఒక పార్టీలో పార్టీని కలిపేసి తన వ్యక్తి గత స్వార్థం, ఆర్థిక ప్రయోజనాలు చూసుకుంటాడని అనుమానంగా తనవైపు చూస్తున్నవాళ్ళకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఆ మాట చెప్పి ఉంటాడని అప్పట్లోనే అందరూ అనుమానించారు.

వాళ్ళు…వీళ్ళూ అడిగారని చెప్పడం ఎందుకు? ఏకంగా దేశంలోనే అత్యంత బలంగా ఉన్న మోడీ-అమిత్ షా సారథ్యంలోని భాజపాలోనే పార్టీ కలిపేయమని అడిగినప్పటికీ నో చెప్పానని తన హీరోయిజం డైలాగులు చెప్పాడు పవన్. ఇదే విషయంపై తాజాగా ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఎపిలో బిజెపి-టిడిపి పొత్తు వ్యవహారాల గురించి మాట్లాడుతూ మాటల సందర్భంలో అమిత్ షాతో జనసేనను కలిపేయమని పవన్‌ని అడిగారా అని అడిగాడు. ఆ వెంటనే పెద్దగా నవ్వేశాడు అమిత్ షా. ఎప్పుడు అడిగానో కూడా పవన్ చెప్పాడా? పవన్‌ని కలిసింది 2014ఎన్నికల సమయంలోనే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కలిసింది లేదు. మరిక ఎప్పుడు అడిగినట్టు? ఎన్నికల సమయానికి అసలు పవన్ పార్టీకి గుర్తింపు ఎక్కడుంది? నాయకుడిగా పవన్ స్థాయి ఏంటి? ఒక పార్టీ స్థాయి, ఒక నాయకుడి స్థాయి ఏంటో కూడా తెలియకుండా సిల్లీ రాజకీయాలు ఎలా చేస్తాం? అని అమిత్ షా నవ్వుకుంటూ చెప్పాడు. అమిత్ షా మాటల్లో ఒక నిజం అయితే ఉంది. అమిత్ షా, పవన్ కళ్యాణ్‌లు కలిసింది 2014 ఎన్నికల ప్రచారం సమయంలోనే. అప్పటికి బిజెపికి అనుకూలంగానే ప్రచారం చేస్తున్నాడు పవన్. జనసేన పార్టీకి గుర్తింపు కూడా లేదు. అలాంటి నేపథ్యంలో పార్టీని కలమని అడిగి, మంత్రి పదవి ఇస్తాం అని పవన్‌కి ఆఫర్ చేయాల్సిన అవసరం అమిత్ షాకు ఏముంది? భాగస్వామ్య పక్షాలు ఒకటి రెండు మంత్రి పదవులు ఎక్కువ అడిగితేనే అధికారంలో ఉన్నవాళ్ళు ఇవ్వడానికి గింజుకుంటారు. అలాంటిది ఎలాగూ అనుకూలంగా ప్రచారం చేస్తున్న నేతకు మంత్రి పదవి ఇస్తామని ప్రత్యేకంగా వాళ్ళే ఉచిత హామీ ఎందుకు ఇస్తారు? ఏంటో పవన్…… మరోసారి తన అబద్ధాలతో అడ్డంగా దొరికిపోయాడు. దేశంలోనే అగ్రస్థాయిలో ఉన్న బిజెపినే తన పార్టీని వాళ్ళ పార్టీలో కలపమని అడిగింది అని చెప్తే గొప్పగా ఉంటుందని పవన్‌కి అనిపించిందో ఏమో తెలియదు. లేకపోతే బిజెపితో పోరాడుతున్నా అన్న కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడేమో. మరి అంత గొప్పోడైతే మోడీ నాకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడు అంటూ ఇప్పుడు చేవలేని మాటలు మాట్లాడుతున్నది ఎందుకో? బడ్జెట్‌లో అన్యాయం చేసినప్పటికీ కనీసం అన్యాయం చేశారు అని కూడా మాట్లాడలేకేగా అధ్యయనాలు, కమిటీలు అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నది. అయినా తెరపైన హీరోయిజం ప్రదర్శించేవాళ్ళందరూ రాజకీయాల్లో హీరోలు కాలేరని చిరంజీవిని చూస్తే తెలియడంలేదా? కాకపోతే పవన్ కళ్యాణ్ చిరంజీవిని మించిన కామెడీ చేస్తుండడమే బాధాకరం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -