Wednesday, May 7, 2025
- Advertisement -

ఢిల్లీ కంటే కులమే ముఖ్యమని అగ్రశ్రేణి పత్రికకు ముఖ్యనేత, కుల నేతల కులోపదేశం

- Advertisement -

ఆదర్శాల విషయంలో ఎప్పుడూ అథమ స్థానంలో ఉండే ఆ పత్రిక అంకెలలో మాత్రం గొప్పగా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటుంది. తెలుగునాట జర్నలిజం విలువలను కాపాడిన ఉదయ కిశోరం లాంటి పత్రికను కక్ష్యగట్టి మరీ తొక్కేశారని ఆ పత్రికా యజమానికి మా చెడ్డపేరు. మామూలుగా అయితే కుల ప్రయోజనాలే ప్రాతిపదికగా తెరవెనుక రాజకీయాలు ఎన్నింటినో నడిపిన ఘనత వాళ్ళది. మేథావి అనే ముసుగులో ఒకరిని దింపి సత్తా ఉన్నవాడని జనాలను నమ్మించాలని చూసినా…..ఎన్నికల సమయం నాటికి ఉపయోగపడేలా ఒక భజన నాయకుడి చేత పార్టీ పెట్టించిన తెరవెనుక సూత్రధారి వారే అని సీనియర్ పాత్రికేయులు చెప్తూ ఉంటారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భజనా చేస్తూ బాగానే మేనేజ్ చేస్తున్నారు. అలాగే రెండో రాష్ట్రంలో కూడా కుల ప్రయోజనాల కోసం గట్టి కృషి చేస్తున్నారు.

అంతా బాగానే ఉన్నా ఢిల్లీ బడ్జెట్ వేడీ దెబ్బకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 2014 ఎన్నికల సమయం నుంచీ నమో నమః అంటూ మొదలెట్టిన భజనతో ఎన్నో ప్రయోజనాలే పొందారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి కుల ముఖ్యనేతకు ఢిల్లీనేత ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీనేతను వదిలేద్దామా అంటే ఆ ఢిల్లీనేత చుక్కలు చూపించే రకం. అందుకే ఢిల్లీనేతకు ప్రాధాన్యత ఇస్తూ కుల ముఖ్యనేత పార్టీకి ప్రాధాన్యం తగ్గించారు. పైగా చాలా మందిని ఆశ్ఛర్యానికి గురిచేస్తూ బద్ధ శతృవు అని ఫీలయ్యే విపక్ష నాయకుడికి కుల నాయకుడి పార్టీ సరసన చోటిస్తూ కవరేజ్ ఇచ్చారు. ఆ దెబ్బతో ఉడికిపోయిన ముఖ్యనేతతో పాటు కుల నాయకులందరూ కూడా ఆ మీడియాధినేతను కలిసి అది పనిగా మొరపెట్టుకున్నారు. ఢిల్లీ నాయకుల కంటే కుల నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పుడు తేడా వచ్చి ప్రతిపక్ష నాయకుడు వస్తే మళ్ళీ లేచే పరిస్థితి ఉండదని మొరపెట్టుకున్నారు. కట్ చేస్తే ఒక్క రోజులో పరిణామాలన్నీ మారిపోయాయి. తోక పత్రికను మించి పోయి రెండు రోజుల ముందు నాటి ప్రసంగాలకు కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పేజీలకు పేజీలు వార్తలు రాసి పడేశారు. ప్రతిపక్ష పార్టీ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించివేశారు.

ఇప్పుడు ఈ పరిణామాలే ఢిల్లీ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగు నాట ఒక కులం నాయకులు, వ్యాపారస్తులు ఆ కులం కోసం ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో మరోసారి ఢిల్లీ నాయకుడికి పూర్తిగా అవగతమైంది. పరిస్థితులను దగ్గరగా చూస్తున్న ఆ ఢిల్లీ నాయకుడు తర్వాత స్టెప్ ఏం ఉంటుందో అని ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. అక్కడ కూడా కుల నాయకులు కొంతమంది గూఢచారుల్లాంటి జర్నలిస్టులను మెయింటెయిన్ చేస్తున్నారు మరి. 2019 ఎన్నికల్లో కూడా కుల పార్టీని నిలబెట్టాలన్న ఆశయం నెరవేరుతుందో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -