టీడీపీ ఎంపీలకు ఘోర అవమానం ఎదురయ్యింది. తాజాగా కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఎంపీలకు షాక్ ఇచ్చారు. రైల్వేజోన్ విషయంపై అధికారపార్టీ ఎంపీలకు సాయంత్రం 4 గంటలకు అపాయంట్‌మెంట్ ఇవ్వడంతో ఎంపీలందరూ మంత్రి కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే అపాయంట్‌మెంట్ వాయిదా వేసిననట్లు సిబ్బంది చెప్పడంతో ఖంగు తిన్నారు ఎంపీలు.
కేంద్రమంత్రి కార్యాలయంకు చేరుకున్న తర్వాత అపాయిట్మెంట్ వాయిదా పడిందని చెప్పటంతో మండిపడ్డారు. దాంతో ఏం చేయాలో ఎంపిలకు అర్ధంకాక తలలు పట్టుకుని అక్కడే వెయిట్ చేస్తున్నారు. అనుహ్యంగా మంత్రి కార్యాలయంలో నుండి వైసిపి తిరుపతి ఎంపి వరప్రసాద్ బయటకు రావటం చూసిన టిడిపి ఎంపిలకు దిమ్మతిరిగపోయింది. ఏంచేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు ఎంపీలు. మిత్రపక్షమైన తమకు అపాయిట్మెంట్ ఇచ్చి వాయిదా వేయటమే కాకుండా అదే సమయంలో వైసిపి ఎంపితో మంత్రి భేటీ అవటాన్ని టిడిపి ఎంపిలు జీర్ణించుకోలేకపోయారు. తిరుపతి రైల్వే సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వరప్రసాద్ వెల్లినట్లు సమాచారం.
ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్రమంత్రి తమకు అపాయిట్మెంట్ ఇచ్చి వాయిదా వేశారని టిడిపి ఎంపిలు మండిపడుతున్నారు. దీన్ని బట్టే చంద్రబాబును దూరం పెడుతున్నారనేది అర్థమవుతోందని ఎంపీలు వాపోతున్నారు.