Tuesday, April 30, 2024
- Advertisement -

ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థికి కూటమి దెబ్బ!

- Advertisement -

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో కూటమి టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వర్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. టీడీపీ అభ్యర్థి ప్రచారానికి జనసేన, బీజేపీ నేతల నుండి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఇక వైసీపీ తరపున కర్నూల్ మాజీ ఎంపీ, బుట్టా రేణుక పోటీ చేస్తుండగా ఆమె విజయం దాదాపు ఖాయమనే చెప్పాలి.

ఇక టీడీపీ అభ్యర్థికి పొత్తు పార్టీల నుండే సహకారం లభించడం లేదు. ఎందుకంటే బీజేపీ ఇంఛార్జీ మురారిరెడ్డి, జనసేన ఇంఛార్జీ రేఖ గౌడ్ టికెట్ ఆశీంచి భంగపడ్డారు. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నా పొత్తులో భాగంగా టీడీపీ దక్కించుకుంది. అయితే తమను ప్రచారంలో కలపుపుకుపోవడం లేదని, అందుకే టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు బీజేపీ,జనసేన నేతలు.

బీజేపీ, జనసేన నేతలు సహకరించకపోవడం ఒక ఎత్తైతే సొంత పార్టీ నుండి కూడా జయ నాగేశ్వర్‌ రెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ పట్ల జయ నాగేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంతమంది టీడీపీ అభ్యర్థిపై ఏకంగా చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వైసీపీ విజయానికి మరింత దోహదం చేసేలా ఉందని స్థానికంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన వైసీపీ అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -