నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలం తరువాత మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉద్రేకంగా ఉన్నారని ఆయన అన్నారు. తాను ఉత్తరాంధ్రులను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు భావిస్తున్నారు.
వెనుకబాటు తనంతో పాటు, అక్కడ అభివృద్దిలో సమస్యలున్నాయని ఆయన అన్నారు. వారి కోసమే నేను పోరాటం చేస్తున్నాని పవన్ తెలిపారు. విశాఖపట్నంలో టీడీపి నాయకులే ఎక్కువ భూకబ్జాలు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.