Tuesday, June 18, 2024
- Advertisement -

బాబు బిగ్ మిస్టేక్.. అడ్డంగా దొరికేశాడు..

- Advertisement -

చంద్రబాబు చేసిన ఒక్క ట్వీట్ ఆయనను అడ్డంగా బుక్ చేసింది. 40 ఇయర్స్ చంద్రబాబు ఇంత అనాలోచితంగా.. సరిచూసుకోకుండా చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను అభాసుపాలు చేసింది. ఏపీ సీఎం జగన్ తీరును ఎండగడుతూ చంద్రబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు బూమరాంగ్ అయిపోయింది.

తాజాగా చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో రెండు ఫొటోలు పోస్ట్ చేసి ఎండగట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఆశావర్కర్ల జీతాన్ని 10వేల పెంచినప్పుడు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఫొటోను ‘అప్పుడు’ అని కోట్స్ పెట్టి.. ఇక దానికిందనే మరో ఫొటోను ఆశావర్కర్లు ప్రభుత్వ దిష్టిబొమ్మను రహదారిపై మోసుకెళ్లే ఫొటోను పెట్టి ‘ఇప్పుడు’ అని రాసి ‘‘ప్రజాక్షేత్రంలో మాట తప్పితే జరిగే సన్మానం ఇదే.. ఆశావర్కర్లను ఆదుకోండి’ అంటూ జగన్ పై సెటైర్లు వేశారు..

అయితే ఇక్కడే చంద్రబాబు పొరపాటు చేశారు. ఆశావర్కర్లు ప్రభుత్వ దిష్టిబొమ్మ పాడె మోస్తున్న ఫొటో అసలు ఏపీలో జరిగిన ఆందోళనే కాదు. అది ఇప్పటిదే కాదు.. 2015లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశావర్కర్లు నిరసన తెలిపిన ఫొటో అదీ.. ది హిందూ పత్రికలో ప్రచురితమైన కథనం..

తాజాగా తెలంగాణ ఆందోళనల ఫొటోను ఏపీ సీఎం జగన్ ను విమర్శించేందుకు వాడడం దుమారం రేపింది. దీనిపై ఓ నెటిజన్ బాబుకు కౌంటర్ గా ట్వీట్ చేసి ఎండగట్టడంతో విషయం వెలుగు చూసింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా విమర్శల్లోనూ ముందూ వెనుక చూసుకోకుండా ట్వీట్ చేసిన వైనం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -