Tuesday, April 30, 2024
- Advertisement -

జలీల్ ఖాన్‌కి దిమ్మతిరిగే షాక్…… రిటైర్మెంట్ ప్రకటించిన చంద్రబాబు

- Advertisement -

జలీల్ ఖాన్ ప్రజా బలం ఎంత అంటే ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చెప్తారు. అయినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం జలీల్ ఖాన్‌ని చేరదీశాడు. ఎమ్మెల్యేను చేశాడు. అయితే చంద్రబాబు చూపించిన డబ్బుకు ఆశపడి జగన్‌కి హ్యాండ్ ఇచ్చాడు జలీల్ ఖాన్. టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత నుంచీ నమ్మి గెలిపించిన జగన్‌ని కించపరిచేలా అవాకులు చవాకులు చాలానే పేలాడు. చంద్రబాబు మెప్పు కోసం జగన్‌ని విమర్శిస్తూ నానా పాట్లూ పడ్డాడు.

కానీ ఆ ప్రయత్నాలేవీ ఇప్పుడు జలీల్ ఖాన్ సీటును కాపాడలేకపోయాయి. రీసెంట్‌గా జలీల్ ఖాన్ నియోజకవర్గంలో సర్వే చేయించిన చంద్రబాబుకు జలీల్ ఖాన్‌పై ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో అర్థమైందట. అన్నింటికీ మించి బికాంలో ఫిజిక్స్ ఎపిసోడ్ తర్వాత నుంచీ ప్రజలందరూ కూడా జలీల్ ఖాన్‌ని సీరియస్‌గా తీసుకోవడం మానేశారన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ జలీల్ ఖాన్ గెలిచే అవకాశమే లేదని…….2014 ఎన్నికల్లో కూడా జగన్‌పైన అభిమానంతో ప్రజలు జలీల్ ఖాన్న‌ని గెలిపించారని, స్వంతంగా జలీల్ ఖాన్‌కి ఐదు వేల ఓట్లు కూడా తెచ్చుకునే సామర్థ్యం లేదని చంద్రబాబు సర్వేలో తేలిందట. అందుకే జలీల్ ఖాన్‌కి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారట. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించడానికి సాయం చే్స్తే మాత్రం ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక జలీల్ ఖాన్‌ని ఎమ్మెల్సీని చేస్తానని మాట ఇచ్చాడట చంద్రబాబు.

అయితే జలీల్ ఖాన్ మాత్రం గవర్నర్‌ని చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చిన సీనియర్ టిడిపి నాయకుడే పదేళ్ళుగా ఎదురు చూపులతో సరిపెట్టుకుంటున్నాడని ……..ఇక నా ఎమ్మెల్సీ హామీ నెరవేరేదెప్పుడు……..అసలు 2019 లో టిడిపి అధికారంలోకి వచ్చేదెన్నడు అని సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశాడట. చంద్రబాబు మెప్పు కోసం సీటు ఇచ్చి గెలిపించిన జగన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించినందుకు తగిన శాస్తే చేశారని……..ఇప్పుడు వైకాపాలోకి కూడా వెళ్ళే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జలీల్ ఖాన్. చంద్రబాబు మార్క్ రాజకీయాలా? మజాకానా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -