Thursday, May 23, 2024
- Advertisement -

ఎప్పుడో జ‌రిగిన పెళ్లికి బాబు ముహూర్తం పెడ్తున్నారంట‌..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చేసే రాజ‌కీయాలే స‌ప‌రేటు. నేను చేస్తే సంసారం…ఇత‌రులు చేస్తే వ్య‌భిచారం అన్న చందంలా త‌యార‌య్యింది. బాబు దేశంలో ఉన్న ఏపార్టీతో నైనా క‌ల‌వ‌చ్చు…కాని ఇత‌ర పార్టీలు క‌లిస్తే దాన్ని త‌న ఆస్థాన మీడియా ద్వారా బూత‌ద్దంలో చూపిస్తారు. బాబు క్రెడిట్ కోసం యొల్లో మీడియా చేసే హంగామా అంతా ఇంతా కాదు.

ఎన్డీఏతో విడాకులు తీసుకున్న త‌ర్వాత బాబు కాంగ్రేస్ పార్టీకి ద‌గ్గర‌య్యారు. మ‌రో వైపు మూడో కూట‌మి అంటూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. బాబు బినామీలుగా చెప్పుకుంటున్న వారిమీద ఐటీ దాడులు జ‌ర‌గుతుంటే నానా హంగామా చేస్తున్నారు. కేంద్రం కావాల‌నే క‌క్ష గ‌ట్టింద‌ని గొంతు చించుకుంటున్నారు.

ఇప్పుడు ఏకంగా ఎన్డీఏకు వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల‌కు వెల్లి ఆయా పార్టీల నేత‌ల‌ను క‌లుస్తూ క‌ల‌రింగ్ ఇస్తున్నారు. అదేదో గొప్ప అన్న‌ట్లు ఆస్థాన మీడియా సొంత డబ్బా కొడుతోంది. విచిత్రం ఏంటంటే యూపీఏ కూట‌మిలో ఉన్న పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. బాబే కూట‌మిని ఏర్పాటు చేశారంటూ ప‌చ్చ మీడియా పాకులాడుతోంది.

ఎన్డీయే అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా…. దానికి వ్యతిరేకంగా యూపీఏ అనే కూటమి ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది కొనసాగుతూ ఉంది. కూట‌మిలో ఇప్పుడు బాబు క‌లిసిన పార్టీలు ఉన్నాయి. ఈయ‌న కొత్త కూట‌మిని ఏర్పాటు చేసేదేముంది.

యూపీఏ కూట‌మి ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఎన్డీఏ ప్ర‌భుత్వంపై కూట‌మి పోరాడుతోంది. మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు చేపట్టారు వాళ్లంతా. త‌గుదున‌మ్మా అంటూ వాళ్లలోకి కొత్తగా ఇప్పుడు వచ్చి కలిశాడు చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు నాయుడు ట్రిక్స్ మాత్రం మరో రకంగా ఉన్నాయి. అవేమిటంటే…. ఆ కూటమిని తనే ఏర్పాటు చేశాను .. తన చొరవ వల్లనే ఆ కూటమి ఏర్పడింది అన్నట్టుగా బాబు ప్రచారం చేసుకొంటూ ఉన్నాడు. నిన్న జేడీఎస్ నేతలను కలిసిన చంద్రబాబు, రేపు స్టాలిన్ ను కలుస్తాడట. అందరినీ ఏకం చేస్తా అని బాబు అంటున్నాడు. వాల్లంద‌రూ అల్ రెడీ యూపీఏ కూట‌మిలో ఉన్నారు.

జనాలను వెర్రి వాళ్లను చేస్తూ చంద్రబాబు ఇలాంటి రాజకీ ట్రిక్కులు చేస్తున్నాడు. గ‌తంలో అంటే సోషియ‌ల్ మీడియా లేక‌పోవ‌డంతో త‌న ఆస్థాన మీడియా అడిందే ఆట పాడిందే పాట‌గా మారింది. కాని ఇప్పుడు బాబు చేస్తున్న త‌ప్పుల‌ను సోషియ‌ల్ మీడియా వేదిక ద్వారా ఎండ‌గ‌డుతున్నారు నెటిజ‌న్లు. మొత్తం పరిణామాలను గమనిస్తున్న వాళ్లు మాత్రం బాబు కామెడీని చూసి నవ్వుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -