వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు…మేనిపులేట్ చేస్తారు…చంద్రబాబును ఎవరు ఏమి చేయలేరు. ఇప్పటివరకు టీడీపీ అధినేత గురించి తెలిసిందిదే. ఇక చంద్రబాబుపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారి జరిగిందిదే.ఆయనపై గతంలో ఎన్నోసార్లు ఆరోపనలు వచ్చాయి…కానీ న్యాయస్ధానాల్లో అవేవి నిలవలేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ తప్పదు అనుకున్న ప్రతీ సందర్భంలోనూ ఆయన బయటికొచ్చారు.
కానీ ఇప్పుడు అంతా తలకిందులైంది. స్వయంగా చంద్రబాబు అంచనానే తప్పింది. జైలుకెళ్లిన తొలి తెలుగు మాజీ సీఎంగా నిలిచారు బాబు. అయితే అరెస్టు అయితానని ముందే తెలిసినా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు. అయితే ఇది ఎన్నికల ముందు సెంటిమెంట్ పండించడానికి అంటే టీడీపీ నేతలకే అంతుచిక్కని ప్రశ్న.
ఇక సమస్య వచ్చిన ప్రతీసారి ఎలా గట్టెక్కాలో బాబుకు స్పష్టంగా తెలుసు. కానీ ఈసారి మాత్రం ఎలా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయారన్నదే క్వశ్చన్. అయితే చంద్రబాబు చివరి నిమిషం వరకు బెయిల్ వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు…కానీ ఆర్ధిక నేరం కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదనే చిన్న లాజిక్ మిస్సయ్యారు బాబు. అయితే ఈ కేసు నుండి గట్టెక్కేందుకు బాబు ఢిల్లీ నుంచి సీనియర్ మోస్టు లాయర్లూ రంగంలోకి దించారు. యాభై కోట్ల పైనే ఖర్చచేశారట. కానీ ఇవేమీ చంద్రబాబును కాపాడలేకపోయింది. ఏదిఏమైనా చంద్రబాబు పొలిటికల్ కెరీర్‌లో ఇది మచ్చగానే మిగిలిపోయింది.