Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్‌కి ఆ బ్యాచ్ టిడిపి ఎమ్మెల్యేల ఫుల్ సపోర్ట్…. బాబు నిఘా

- Advertisement -

చంద్రబాబు టైం అస్సలు బాగాలేదు. గతంలో సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ తన కనుసన్నల్లో జరిగే స్థాయి నియంతృత్వంతో పాలించాడు చంద్రబాబు. కానీ ఇఫ్పుడు మాత్రం కనీసం పార్టీలో కూడా చంద్రబాబు మాట ఎవ్వరూ వినడంలేదు. ఓ వైపు రామసుబ్బారెడ్డి వర్సెస్ ఆదినారాయణరెడ్డి గొడవ ముదుతోంది. మరోవైపు అఖిలప్రియ వ్యవహారం బాబుకు తలనొప్పి తెస్తోంది. ఈ విషయాలన్నీ ఇలా ఉంటే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బాబుకు సరికొత్త తలనొప్పి అయి కూర్చున్నాడు.

తెదేపా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువు నారాయణ ……ఇంకా గంటా బంధువులు, సన్నిహితులు అయిన ప్రజాప్రతినిధులు టిడిపిలో పది మంది దాకా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన గంటాకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరు, పవన్‌లతో సన్నిహితంగా ఉండొద్దని బాబు హెచ్చరించినప్పటికీ గంటా మాత్రం అస్సలు కేర్ చేయలేదు. రాజకీయం రాజకీయమే……మెగా ఫ్యామిలీపైన ఉండే అభిమానం అభిమానమే అని చెప్పాడు గంటా. ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్‌కి గంటా సన్నిహితులు అన్నివిధాలుగా సాయపడుతున్నారు. పవన్ మాత్రం చంద్రబాబును, లోకేష్‌ని టిడిపి ప్రభుత్వాన్ని ఓ స్థాయిలో విమర్శిస్తున్నాడు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా ఉన్న గంటా కనీసం పవన్ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడానికి కూడా ముందుకు రావడంలేదు. గంటా వైపు నుంచి చంద్రబాబుకు స్పష్టమైన సందేశాలే వస్తున్నాయి. కానీ 2019 ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబుకు గంటాను భరించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి. ఎన్నికల సమయానికి జనసేన అధికారంలోకి వస్తుంది అన్న ఆలోచన వచ్చినా గంటా శ్రీనివాసరావు అండ్ బ్యాచ్ అంతా కూడా పవన్ పార్టీలో చేరిపోతారనడంలో సందేహం లేదు. అదే జరిగితే మాత్రం టిడిపికి కోలుకోలేని దెబ్బ. ఈ సంకట స్థితి నుంచి చంద్రబాబు ఎలా బయటపడతాడో అన్న టెన్షన్ టిడిపి నాయకుల్లో కూడా కనిపిస్తుండడం గమనార్హం. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయి సమస్యను చంద్రబాబు ఎలా డీల్ చేస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -