సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. కఠిన నిర్ణయాలే అయినా రెండోసారి అధికారంలోకి రావడానికి తప్పదంటూ నేతలకు సంకేతాలిస్తూ ఎక్కడా అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాలను ప్రకటించగా మొత్తం హాఫ్ సెంచరీ దాటింది. తొలి విడతలో 11 స్థానాల్లో, రెండో విడతలో 27 స్థానాల్లో అభ్యర్థుల మార్పు చేపట్టారు సీఎం జగన్. ఇక తాజాగా మూడో జాబితా 21 మందితో రిలీజ్ చేయగా ఇందులో 6 ఎంపీ స్థానాలు,15 అసెంబ్లీ స్థానాలున్నాయి.
ఇక మూడో జాబితాలో బీసీలకు పెద్దపీట వేశారు జగన్. రీసెంట్‌గా పార్టీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఇంఛార్జీగా బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మరో జాబితా ఉండనున్నట్లు తెలుస్తోండగా జిల్లాల వారీగా ఇంఛార్జీల విషయానికొస్తే..కడప జిల్లాలోని రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, కడప జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డిని నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డికి టికెట్ నిరాకరించారు.
ఇక లూరు ఎంపీ అభ్యర్థిగా మంతి కారుమూని నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను ఎంపిక చేశారు. కర్నూలు జిల్లాలో మూడు స్థానాల్లో మార్పులు చేశారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరి జయరాంని కర్నూలూ ఎంపీ అభ్యర్థిగా నియమింయారు. ఇక ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జడ్పీటీసీ విరుపాక్షిని ప్రకటించారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ స్థానంలో ఆదిమూలపు సతీష్‌కు టికెట్ కేటాయించారు.
శ్రీకాకుళం జిల్లా విషయానికొస్తే ఇక్క కళింగ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఇచ్చాపురం- మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్ ఇంఛార్జ్ గా ఉండగా జెడ్పీ చైర్మన్ పిరియ విజయ (సాయిరాజ్ భార్య)కు సీటు కేటాయించారు. టెక్కలి నుండి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి కొద్దిరోజుల క్రితం ఇంఛార్జీగా నియమించగా తిరిగి దువ్వాడ శ్రీనుకే టికెట్ ఇచ్చారు. అచ్చెన్నాయుడుని ఢీకొట్టేందుకు దూకుడుగా ఉండే దువ్వాడ అయితేనే కరెక్ట్ అని భావించారు జగన్.
ఇక శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్‌ను ప్రకటించగా గతంలో టెక్కలి నుండి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంటుకు తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తి స్థానంలో కోనేటి ఆదిమూలంను ప్రకటించారు. మంత్రి జోగి రమేశ్ ను పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు.