ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. భాజాపాతో నాలుగు సంవత్సరాలుగా అంటగాకి ప్రత్యేకహోదాపై ఇప్పుడెందుకండీ నాటకాలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని దండుకున్నారని… ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
పార్లమెంటులో భజన కార్యక్రమాన్ని నిర్వహించారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అనేది ప్రాంతీయ పార్టీలతో రాదని… జాతీయ పార్టీలతోనే అది సాధ్యమవుతుందని కోట్ల అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు.