ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్ నైతిక విలువలు నచ్చడంతోనే పార్టీలో చేరుతున్నట్ల తెలిపారు. టీడీపీలో ఉండి తాను సంపాదించింది ఏమీ లేదన్న ఆయన …ఆ పార్టీకి, చంద్రబాబుకు ఎంతో సాయం చేశానన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మంచి రోజు చూసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడనుంచి పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయిందని ఆరోపించిన ఆయన.. ఈ ఐదేళ్లలో ప్రతీ ఎమ్మెల్యే రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సంపాదించారని విమర్శించారు. బాబు సీఎం కావడానికి కారణం తానేనన్నారు. అయితే తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ విషయాలు, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలిపారు. వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రతి పనికి ఇరవై శాతంపైగా కమీషన్లు డిమాండ్ చేస్తున్నారు. బాబు ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం అన్నింటిలో విఫలమైందన్నారు.
- Advertisement -
వైఎస్ జగన్‌తో జై రమేష్ భేటీ…త్వరలో లాంఛనంగా వైసీపీలోకి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -