Thursday, May 16, 2024
- Advertisement -

మా ఎమ్మెల్యే క‌న‌ప‌డుట‌లేదు..పాడేరు నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు..

- Advertisement -

విశాఖపట్నం జిల్లా పాడేరు వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డిఈశ్వరికి నియోజ‌క వ‌ర్గంలో చుక్కులు చూపిస్తున్నారు ప్ర‌జ‌లు. అభివృద్ధికోస‌మే పార్టీ మారాన‌ని చెప్పిప ఎమ్మెల్యేకు క‌ష్టాలు త‌ప్ప‌డంలేదు. మా ఎమ్మెల్యే క‌న‌ప‌డ‌టంలేదంటూ అక్క‌డి ప్ర‌జ‌లు చెప్పుకుంటున్నారు.

ఎందుకంటే నియోజకవర్గంలో పర్యటించి జనాలను కలిసి చాలా కాలమైందట. తమకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవటానికి ప్రయత్నిస్తుంటే ఎంఎల్ఏ అందుబాటులో ఉండటం లేదని జనాలు మండపోతున్నారట. ఏదో పార్టీ కార్యక్రమాల వరకు హాజరవుతున్నారు సెక్యూరిటి మధ్య తిరుగుతున్నారంట‌.

టీచర్ గా పనిచేస్తున్న గిడ్డి ఈశ్వరికి వైసిపి పోయిన ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో టిక్కెట్టిచ్చి గెలిపించుకున్నది. గెలిచిన తర్వాత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంఎల్ఏకి బాగా ప్రాధాన్యతనే ఇచ్చారు. గిడ్డి కూడా వైసిపి తరపున టిడిపి ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే చేశారు. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. వైసిపిలో నుండి టిడిపిలోకి వెళ్లారు. కోట్ల రూపాయలు తీసుకుని, మంత్రిపదవికి ఆశపడి పార్టీ ఫిరాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.

టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత గిడ్డి పరిస్ధితి కూడా చాలా మంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లాగే తయారైంది. టిడిపిలోకి మారిన తర్వాత నియోజకవర్గంలో స్వేచ్చగా తిరగలేకపోతున్నారు. ఎక్కడ తిరుగుదామని అనుకున్నా జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మొన్నటి జన్మభూమి కార్యక్రమంలో జనాలు నిలదీసిన దెబ్బకు చివరకు తన కారును కూడా వదిలేసి ఆటోలో వెళ్ళిపోయారు. ఆమెప‌రిస్థితి ఎలాఉందంటే ఒకపుడు సన్నిహితంగా ఉన్న టీచర్లు కూడా మాట్లాడటం లేదట. పాపం ఎలావుండే ఎంఎల్ఏ ఫిరాయించిన తర్వాత ఎలా అయిపోయారో చూస్తే అర్థం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -