Thursday, May 8, 2025
- Advertisement -

జగన్ ధీమా అదే.. అందుకే పొత్తులకు నో ఛాన్స్ !

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మూడున్నర సంవత్సరాలు పూర్తి అయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఈ మూడున్నర సంవత్సరాలలో జగన్ పరిపాలన పరిపాలన ఎలా ఉంది ? జగన్ పాలనను ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తున్నారు ? వచ్చే ఎన్నికల్లో ప్రజల ఉద్దేశం ఎలా ఉండబోతోంది ? మళ్ళీ వైసీపీకే పట్టం కడతారా ? కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటరా ? అలాంటి ప్రశ్నలు రాక మానవు. అయితే ఈ ప్రశ్నల సంగతి అలా ఉంచితే వైఎస్ జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయం అని ధీమాగా ఉన్నారు. కేవలం విజయం మాత్రమే కాదు 175 స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని దృఢ నిశ్చయంతో ఉన్నారు. .

ఇదే టార్గెట్ గా వైసీపీ నేతలకు దిశ నిర్దేశం కూడా చేస్తున్నారు.కానీ రియాల్టీలో చూస్తే ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై సానుకూలత ఏ స్థాయిలో వుందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో కనిపిస్తోంది. జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వారు జగన్ పాలనపై సానుకూలంగా స్పందిస్తుంటే.. రాష్ట్ర అభివృద్ది గురించి ఆలోచించే వారిలో మాత్రం వ్యతిరేకత స్పస్తంగా కనిపిస్తోంది. మరి 175 స్థానాల్లోనూ విజయం వైసీపీ దే అని జగన్ ఎలా చెబుతున్నారు ? అసలు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ? ఇంతకీ జగన్ కు ఉన్నది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా ? అనే సందేహాలు ప్రతి ఒక్కరికీ రాక మానవు.

ఎందుకంటే ప్రస్తుతం జగన్ వైఖరి అలాగే ఉంది మరి. అయితే జగన్ అంతలా ధీమా వ్యక్తం చేయడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాలలోనే ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశామని వైసీపీ గట్టిగానే చెప్పుకొస్తోంది.. ఒకటి అరా హామీలు తప్పించి నిజంగానే ఇచ్చిన హామీలలో చాలా వరకు అమలు చేసింది జగన్ సర్కార్. ఇక జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లభ్ది పొందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇదే జగన్ కాన్ఫిడెన్స్ కు ప్రధాన కారణం చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో పథకాల ద్వారా లభ్ది పొందిన వారు తన వెంటే ఉంటారని, విజయం అనేది నల్లేరు మీద నడక అని అందుకే లక్ష్యాన్ని 175 స్థానాలపై ఉంచారని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.

అందుకే ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని, ఎలాంటి పొత్తులకు వెళ్ళేది లేదని మరోసారి ఇటీవల స్పష్టం చేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడి సభలో కేంద్రంతో ఉన్న అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనలు తప్పా.. వేరే ఏజండా లేదు ఉండబోదని అన్నారు వైఎస్ జగన్. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్రంతో కూడా ఎలాంటి పొత్తులు పెట్టుకునే అవకాశమే లేదని చెప్పకనే చెప్పారు. అంటే ఆయన వచ్చే ఎన్నికలపై కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. మరి ఎన్నికల్లో ఎప్పుడు కూడా అంచనాలను తలకిందులు చేసే ప్రజా నిర్ణయం.. జగన్ కాన్ఫిడెన్స్ ను ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

పవన్ దారిలో లోకేష్.. సక్సస్ అవుతాడా ?

మోడీ ఇచ్చిన షాక్.. కే‌సి‌ఆర్ అసలు ఊహించలేదా ?

మోడీతో మీటింగ్.. బాబు తో డేటింగ్ పవన్ పై సెటైర్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -