Thursday, May 2, 2024
- Advertisement -

మోడీ ఇచ్చిన షాక్.. కే‌సి‌ఆర్ అసలు ఊహించలేదా ?

- Advertisement -

తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణపై గతకొంత కాలంగా రగడ జరుగుతున సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తూ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ చర్యలపై సింగరేణి కార్మికులు గత కొన్నాళ్లుగా నిరసనలు చేస్తూ, ఆందోళనల బాటా పట్టారు. దీనిపై గతంలో కేంద్ర ప్రభుత్వం గాని, బీజేపీ అధిష్టానం గాని పెద్దగా స్పందించకపోవడంతో సింగరేణి ప్రైవేటీకరణ ఖాయమనే వాదన కూడా బలంగానే వినిపించింది. దీంతో ఏపీలో విశాఖ ప్రైవేటీకరణ మాదిరిగా.. తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక సింగరేణి ప్రవేటీకరణ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యలపై ఘాటుగానే విమర్శలు చేస్తూ వచ్చింది. .

సున్నితమైన ఈ సింగరేణి సమస్య విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ప్రజల వద్ద మార్కులు కొట్టేయాలని టి‌ఆర్‌ఎస్ భావించింది. అయితే తాజాగా తెలంగాణ వచ్చిన ప్రధాని మోడీ సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ఎవరు ఊహించని విధంగా స్పందించారు. సింగరేణి ప్రైవేటీకరణ అసలు ఉండబోదని, ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం రుమర్లు పుట్టిస్తున్నారని, సింగరేణి విషయంలో కూడా ఇలాంటి పుకార్లే పుట్టిస్తున్నారని మోడీ అన్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటే.. 49 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వానిదని, మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడూ దానిని ప్రవేటీకరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలా ఉంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సృష్టిస్తున్న పుకార్లు అంటూ మోడీ కొట్టిపాడేశారు. ఇక గతంలో సింగరేణి కోల్డ్ బ్లాక్స్ లోని నాలుగింటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంతో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించారు. సమ్మెకు కే‌సి‌ఆర్ కూడా సంఘీభవం తెలిపారు. ప్రైవేటీకరణను ఆపాలంటూ మోడీకి అప్పట్లో లేఖ కూడా రాశారు. అయితే సింగరేణి విషయంలో ఎలాంటి ప్రైవేటీకరణ ఉండబోదని ప్రధాని మోడీ స్పష్టం చేయడం.. కే‌సి‌ఆర్ అసలు ఊహించని పరిణామమే. మరి సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల మద్దతు కూడగట్టాలని భావించిన కే‌సి‌ఆర్ కు.. ప్రధాని షాక్ ఇచ్చారనే చెప్పాలి. మరి సింగరేణి విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కే‌సి‌ఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మోడీతో మీటింగ్.. బాబుతో డేటింగ్ !

పవన్ దారిలో లోకేష్.. సక్సస్ అవుతాడా ?

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -