Thursday, May 8, 2025
- Advertisement -

జగన్ సమక్షం లో వైసీపీ లో చేరిన రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్

- Advertisement -

వైసీపీకి రోజు రోజుకీ బ‌లం పెరిగిపోతోంది. పార్టీలోకి వ‌ల‌స‌లు మాత్రం ఆగ‌డంలేదు. తాజాగా చంద్ర‌బాబునాయుడికి మ‌రో షాక్ త‌గిలింది. బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉన్న మాజీ భ‌ద్ర‌తాధికారి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

గత కొద్దిరోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి.. నెల రోజుల కిందట టీడీపీ కీలక నేత యలమంచిలి రవి వైసీపీలో చేరారు అంతేకాకుండా మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వర రావు అయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ లు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

తాజాగా రాయలసీమ మాజీ ఐజీ షేక్ మహ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి…కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో సాగుతోంది. గతంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద సెక్యూరిటీ అదికారిగా మహ్మద్ ఇక్బాల్ ప‌నిచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -