నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉనికి దేశంలో ఏవిధంగా ఉంటుందో తేలేదు కానీ పార్టీ లోని సీనియర్ ల అసమ్మతి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు.. మొన్న జరిగిన సమావేశంలో అన్ని సద్దుమణిగాయని అనుకున్నా తాజాగా గులాం నబీ ఆజాద్ రాసిన లేఖ తో ఈ వివాదం మరింత ముదురుతుందే తప్ప తగ్గట్లేదని అర్థమవుతుంది.ఇక ఇటీవలే జరిగిన సమావేశం కు ముందు గులాం నబీ ఆజాద్ తో సహా పలువురు గాంధీ కుటుంబం వ్యవహార శైలిపై కొన్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..
ముఖ్యంగా రాహుల్ గాంధీ ని టార్గెట్ చేస్తూ రాహుల్ సీనియర్ ల అభిప్రాయాలూ తెలుసుకోకుండానే కొన్ని కీలక నిర్ణయాలు తనకు అవసరమయ్యే విధంగా తీసుకుంటున్నదని, సీనియర్ లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు.. దాంతో పార్టీ కి వారికి మధ్య చెడిందనే విషయం కూడా బయటకి పొక్కింది.. కానీ మొన్నటి సోనియా మీటింగ్ లో అన్ని సద్దుమణిగాయి.. ఇక ఎప్పటినుంచో నానుతున్న అధ్యక్షుడి విషం కూడా క్లారిటీ వచ్చేసింది.. ఇక రాజకీయంగా పార్టీ ని ఎలా బలోపేతం చేయాలనేదే కాంగ్రెస్ ముందు ఉన్న కార్యాచరణ అని అందరు అనుకుంటున్నా ఈ తరుణం లో గులాం నబీ ఆజాద్ సోనియా కి రాసిన తాజాగా లేక నేషనల్ కాంగ్రెస్ లో మరో సారి అలజడి సృష్టించింది.
ఈ లేఖ లో కాంగ్రెస్ పార్టీలో మార్పులు జరగాల్సిందేనన్నారు. ఇప్పటికైనా మనం మారాలన్నారు ఆజాద్. ఇప్పటికైనా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించకపోతే మరో యాభై ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలసి వస్తుందని అన్నారు. ఢిల్లీకి వచ్చి వెళుతున్న వారిలో ఒకరిని రాష్ట్ర అధ్కక్షులుగా నియమిస్తున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ తో పాటు రాష్ట్ర అధ్యక్షులకు కూడా ఎన్నికలు జరగాలని ఆజాద్ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ పరిష్టితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ అసమ్మతులతో పార్టీ పరువు, ప్రతిష్ట మరింత దిగజారకముందే సోనియమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి..