దేశంలో అత్యం ప్ర‌భావ‌శీల వ్య‌క్తుల జాబితాలో చంద్రబాబు, వెంక‌య్య‌, కేసీఆర్‌ను వెన‌క్కు నెట్టిన జ‌గ‌న్

భారతదేశంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాను ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రూపొందించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో కొన సాగుతుండా.. బీజేపీ చీఫ్ అమిత్ షా రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మూడో స్థానంలో, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాలుగు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టాప్-10లో చోటు సంపాదించారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే చంద్ర‌బాబు, కేసీఆర్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కంటే జ‌గ‌న్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజానీకానికి దగ్గరవుతుండ‌టంతోపాటు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం లాంటి విష‌యాలు జ‌గన్‌కు ప్ల‌స్ పాయంట్లు. దీంతో సదరు వెబ్‌సైట్ విపక్ష నేతకు 35వ స్థానం కట్టబెట్టింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి పోటీదారుగా జగన్‌ను అభివర్ణించింది.

కాగా, ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో పోరాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి 36వ స్థానం దక్కింది. ఈ జాబితాలో చంద్రబాబు కంటే జగన్ ఒక స్థానం ముందుండటం ఆసక్తికరం. బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న రామ్ మాధవ్‌కు 47వ స్థానం దక్కగా.. కేసీఆర్ 52వ స్థానంలో, వెంకయ్య 58వ స్థానంలో ఉన్నారు.
Source By : Indian Express