Thursday, May 9, 2024
- Advertisement -

అదిరా సాంబా విషయం……. అంతా సర్వమంగళ మేళమే…. ఆశలొద్దురోయ్

- Advertisement -

మాటలదేముంది ………. ఎవరైనా చెప్పొచ్చు. చచ్చేవరకూ అబద్ధం చెప్పను…… ఇప్పటి వరకూ చెప్పలేదు…… నిప్పులా బ్రతికా అని కళ్ళ ముందే తప్పులు చేస్తూ దొరికిపోయినవాళ్ళు చెప్పగా లేనిది ఇంకెవరికైనా ఎందుకు జంకు? ఇక మదర్ థెరిస్సా, చేగువేరా, భగత్ సింగ్…….. ఇంకా జనాల ఓట్లు పడే అవకాశం ఉన్న ప్రముఖుల పేర్లు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను కూడా అలా ప్రాణాలైనా త్యాగం చేసే టైపే అని చెప్పొచ్చు. ఇక గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి రచయితల పేర్లు చెప్పి…….నాలోనూ రచయిత ఉన్నాడు సుమా అని నమ్మించొచ్చు. మేధావులు అని మీడియా ముద్దు వేసి ఉన్న కుహానా మేధావులతో కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చీ నేను కూడా మేధావినే అని అనిపించొచ్చు. రంగేసుకోవడం అలవాటైన వాళ్ళే కదా. ఇక నటనకు కొదవేముంది? మేధావిని అని అనిపించుకోవడానికి కళ్ళద్దాలు కూడా వేషంలో భాగంగా చేసుకోలేదా?

కాకపోతే అవన్నీ వేషాలేనోయ్ అభిమాని. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో అందరి పేర్లూ చెప్పి హీరోయిన్స్ పేర్లు మర్చిపోవడం, హీరోయిన్స్ పేర్లు చెప్పేటప్పుడు మా హీరో అస్సలు హీరోయిన్స్‌తో అంటీ ముట్టనట్టు ఉంటాడబ్బా అని అమాయకంగా నమ్మకు. కాస్త ఫాం హౌస్ వ్యవహారాలను కూడా కళ్ళు తెరిచి చూడు. అలాగే 2009 ఎన్నికల్లోనే కోట్లాది రూపాయలు మన హీరోల బంధువుల ఇళ్ళలోనే పట్టుబడిన వైనం మర్చిపోకు. ఆ తర్వాత పార్టీని అమ్ముకోవడం…….. 2014లో రాష్ట్ర విభజన అంతా అయిన తర్వాత పార్టీ పెట్డడం…….. 2014 ఎన్నికల్లో బేరసారాలు…… అబ్బో అన్నాతమ్ములిద్దరి రాజకీయం వ్యక్తిగతంగా ఎంబిఎ స్టూడెంట్స్‌కి పాఠాలుగా బోధించాల్సినంత లాభదాయకమైన వ్యవహారం.

ఇప్పుడిక 2019 ఎన్నికల్లో ఇద్దరం కలిసే వస్తామని ‘రంగస్థలం’ సాక్షిగా సూచనలు ఇస్తూనే ఉన్నారు. అలాగే ఫ్యాక్షనిస్టులు అయితేనేం, క్రిమినల్స్ అయితేనేం…… ఇంకెవరైనా అయితేనేం…. ధనబలంతో, బలగంతో ప్రజాబలం కొల్లగొట్టే సామర్థ్యం ఉందా……. అయితే జంపింగ్ చేసెయ్…… చేర్చేసుకుంటాం…. అన్న ఆఫర్స్ ఇవ్వడం కూడా అదుర్స్. 2014లో పార్టీ స్థాపన సభలో జంపర్స్‌కి, జోకర్స్‌కి స్థానం లేదన్నావుగా అని అడగకండిరోయ్……… ప్రశ్నించడానికి వచ్చాడు……… మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు. అయినా అక్కడ ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ జంపర్సేగా. వాటే రాజకీయం స్టార్ వారూ…… కాకపోతే కాస్త ఆ చేగువేరా, భగత్‌సింగ్, మదర్ థెరిస్సా మాటలు…… నిజాయితీ అంటూ కబుర్లు వద్దు స్టారూ…… నిప్పు అబద్ధాలనే తట్టుకోలేకపోతున్నారు జనాలు…….. ఇక నిజాయితీ అంటూ తమరు కూడా మొదలెడితే …… పాపం అభిమాన జనం…….. ఆగమైపోరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -