Sunday, May 5, 2024
- Advertisement -

చ‌చ్చేదాకా పోరాటం చేయ‌మ‌నండి చూస్తాం…?

- Advertisement -

ఏపీ ప్ర‌త్యేక హోదాకోసం వైసీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఢిల్లీలో గ‌త నాలుగు రోజులుగా ఆమ‌ర‌ణ‌నిర‌హారా దీక్ష చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, మేక‌పాటి ఆరోగ్యం క్షీనించ‌డంతో వారిని హ‌స్ప‌ట‌ల్‌కు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌త్యోక హోదా కోసం ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న నేత‌ల‌పై టీడీపీ ఎంపీ జేసీ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

నాలుగు రోజుల పాటు అన్నం తినకుండా ఉంటే ఎవరికైనా నీరసం వస్తుందని, ఢిల్లీలో కూర్చుని దీక్ష చేస్తున్నామని చెబుతున్న వైసీపీ నేతలు అంతకన్నా ఇంకేమీ చేయలేరని తెలుగుదేశం ఎంపీ జేసీ ఎద్దేవా చేశారు. నిరాహారదీక్షకు కూర్చున్న ఐదుగురిలో ఇప్పటికే మూడు వికెట్లు పడిపోయాయని, ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ నేడో, రేపో మిగతా ఇద్దరూ ఆసుపత్రులకు వెళ్లిపోతారని వ్యంగంగా వ్యాఖ్యానించారు.

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసినట్టుగా మరణించేంత వరకూ వైకాపా ఎంపీలు దీక్షలు చేయగలరా? అని జేసీ ప్రశ్నించారు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు రిజైన్ చేస్తే, తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు. తనతో పాటు మిగతా ఎంపీలనూ రాజీనామా చేయిస్తానని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -