Friday, May 17, 2024
- Advertisement -

మాట్లాడటం రాక.. పవన్ కు ఎంత నష్టం

- Advertisement -

పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాటి జరుగుతుంది. ఎవ్వరూ వదిలిపెట్టడం లేదు. ఏదో చేద్దామనుకుంటే ఏదో అవ్వడం పవన్ కు ఏం అర్ధం కావడం లేదు. పవన్ వెంట ఉన్నటువంటి కొందరు మేథావులు(మీడియా రంగంలో అన్ని రకాలుగా విఫల మైనవారు) ఆయనకు ఏం చెబుతున్నారు. ఎలాంటి విశ్లేషణల రిపోర్టులను అందిస్తున్నారో ఎవ్వరికీ అర్ధం కాకుండా ఉంది. ఒకవేళ వారు ఇచ్చిన రిపోర్టులను పవన్ విశ్లేషిస్తూ కొంత వరకు చెప్పలేకపోతున్నాడట. అయితే దాని సోర్స్ ను గుర్తించుకుని తనకు వచ్చిన స్టైట్లో లిమిట్స్ దాటి చెప్పడంతో ఎక్కడలేని సమస్యలు వచ్చిపడుతున్నాయని తెలుస్తుంది.

మొన్న విజయవాడలో చెప్పినదాని ప్రకారం చూస్తే.. వండవీటి రంగా హత్యను ప్రస్థావించడం ఘోరమైన తప్పిదంగా భావించాలి. కులానికి వ్యతిరేకమంటూనే కులనాయకుడిగా నోటెడ్ అయిన వ్యక్తిని మహానుభావుగా కీర్తించడం చూసాక కత్తిమహేష్ లాంటి వారు పవన్ పార్టీని కులపిచ్చి పార్టీగా ట్రీట్ చేశారు. ఇది జనసేనకు భారీ డ్యామేజ్ అయింది. కత్తి మహేష్ ను వారు ముందే లైట్ తీసుకుంటే ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు. కాని అలాంటి పని చేయకపోవడంతో సమస్య జఠిలమైపోయింది. ఇపుడు పవన్ ముందున్న మార్గాలు ప్రసంగాల సమయంలో ఏం మాట్లాడుతున్నామో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఏదో సినిమలో చెప్పినట్లు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పటికైనా ప్రిపేరింగ్ ప్రసంగాలు చేయడం ఉత్తమం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -