Tuesday, May 7, 2024
- Advertisement -

ప‌వ‌న్ స‌వాల్ ను లోకేష్ స్వీక‌రిస్తాడా..?

- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై ముఖ్యంగా చంద్ర‌బాబు త‌న‌యుడు నారాలోకేష్ పై శివాలెత్తుతున్నారు. గ‌తంలో ప‌వ‌న్ చంద్ర‌బాబు ను, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్య‌లు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నారా లోకేష్ క‌ర‌ప్ష‌న్ కింగ్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు నారా లోకేష్ అవినీతి మీకు క‌న‌బ‌డడం లేదా అని ప్ర‌శ్నిస్తూ ప్ర‌భుత్వానికి ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు. లోకేష్ అవినీతి గుర్తు చేస్తు చంద్ర‌బాబు రాష్ట్రాన్ని కరప్షన్ ఆంధ్రా చేశారని మండిప‌డ్డారు. 2019ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే మీ కొడుకు నారా లోకేష్ అవినీతి పాల్ప‌డుతున్నారని అన్నారు. మీ అబ్బాయి అవినీతి మీకు క‌నిపించ‌డంలేదా..? క‌నిపించినా మీరే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారా అని ప్ర‌శ్నించారు. నారాలోకేష్ అవినీతి చూస్తుంటే ఎన్టీఆర్ ఆత్మ‌క్షోభిస్తుంద‌ని ఎద్దేవా చేశారు.

నారా లోకేష్ విష‌యంలో ఇప్ప‌టికీ మీ బుద్ధులు , మీ ప‌ద్ద‌తులు మార‌లేద‌ని అన్నారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో మీ హ‌స్తం. శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయని.. అది మీకు కనిపించడం లేదా అని అన్నారు. అందుకే కాబోలు లోకేష్ అవినీతి కార‌ణంగానే మీరు ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూతిరిగినా పీఎం మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డంలేద‌ని తెలిసింద‌ని అన్నారు. అలా నాటి నుంచి నారాలోకేష్ పై ప‌వ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతూ వ‌స్తుంది. తాజాగా లోకేష్ స‌మ‌ర్ధ‌త‌, రాజ‌కీయం పై ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేష్ ఎంత‌టి స‌మ‌ర్ధుడో తెలుసు కాబ‌ట్టే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యార‌ని అన్నారు. ద‌మ్ముంటే లోకేష్ ను ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌త్య‌క్షం ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. తాను జ‌న‌సేన పార్టీకి చెందిన అభ్య‌ర్ధిని నిల‌బెడ‌తాను ఎవ‌రు గెలుస్తారో.

ఉత్త‌రాంధ్ర‌కు రోల్ మోడ‌ల్ గా ఉన్న వైజాగ్ ను అభివృద్ధి చేసే ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు. కొండ‌లు క‌న‌బ‌డితే చాలు తొవ్వుకోవ‌డం, సొమ్ము చేసుకోవ‌డం. నేత‌లకు క‌మీష‌న్లు ఇచ్చిన ఓ సంస్థ‌కు ఎక‌రం రూ.35ల‌క్ష‌ల‌కు అప్ప‌నంగా ఇచ్చేశారు. అదే క‌మిష‌న్ ఇవ్వలేదంటే ఎక‌రం పొలం రూ.1కోటి, రూ.2కోట్లంటూ దోచుకుంటున్నార‌ని చెప్పారు.

65ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబుకు డ‌బ్బు, ప‌ద‌వుల మీద వ్యామోహం త‌గ్గ‌లేదు. మార్పు జ‌ర‌గాలంటే లోకేషే సీఎం కావాలా..? ముఖ్య‌మంత్రి కొడుకు ముఖ్య‌మంత్రి , వాళ్ల‌పిల్ల‌లు ముఖ్య‌మంత్రుల్ని చేయండి. మమ్మ‌ల్ని ఎక్కి తొక్కండి. అంద‌రితో క‌ష్టం చేయించి ..ఉమ్మ‌డిగా తిరిగి ఒక్క‌రే బ‌ల‌వంతులు కావాలంటే కుద‌ర‌దు. అలాంటి వారిని ఎదుర్కొంటానంటూ లోకేష్ గురించి ప్ర‌స్తావ‌న తెచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -