Friday, May 10, 2024
- Advertisement -

ట్విట్ట‌ర్‌లో స‌మంతకు ఝ‌ల‌క్ ఇచ్చిన అభిమాని

- Advertisement -

హీరోయిన్ స‌మంత‌కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు.స‌మంత ప్ర‌స్తుతం ద్విభాషా చిత్రం యూటర్న్‌తో పాటు తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న సూపర్‌ డీలక్స్, తెలుగులో తన భర్త నాగచైతన్యతో ఒక చిత్రం చేస్తున్నారు. శివకార్తికేయన్‌తో నటించిన సీమరాజా చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది.స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తు ఉంటుంది.అయితే స‌మంతకు ఓ అభిమాని షాక్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. స్నేహితులు, సినిమా వాళ్ల ప్రశ్నలకే తప్ప సమంత అభిమానులకు బదులివ్వడం లేదట.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీరాభిమాని కాస్త ఘాటుగానే ప్రశ్నించాడు. అదేమిటంటే తాను ఇప్పటి వరకూ వేలకు పైగా మీకు ట్వీట్‌ చేశానని, మీరు మాత్రం ఒక్కసారి కూడా బదులివ్వలేదని ఆమెపై కాస్తా కోపంతో ఉన్నాడు స‌ద‌రు అభిమాని.ఇదే విష‌యాన్ని స‌మంత ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాడు ఆ అభిమాని . తనకు వెయ్యికి పైగా మెసేజ్‌లు చేసినందుకు కృతజ్ఞతలు అని ఆ అభిమానికి బదులిచ్చారు. అంతే తనకు సమంత టీట్‌ చేయడంతో ఆ అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -