2019ఎన్నికల్లో వైఎస్ జగన్‌కి ఓటేయాలని అనంతపురం ఓటర్లకు చెప్పిన పవన్

- Advertisement -

తెలంగాణాలో పర్యటించినప్పుడు కెసీఆర్ స్మార్ట్ సిఎం, తెలంగాణా అద్భుతంగా అభివృద్ధి చెందుతోందన్న పవన్……మరోవైపు ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారని, వాళ్ళ కష్టాలు తుడవడానికి వచ్చానని రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలంగాణావారి చేత పిచ్చోడనిపించుకున్నాడు పవన్. పవన్ ఎంతగానో అభిమానించే కమ్యూనిస్టు నాయకులు కూడా పవన్‌కి పిచ్చోడన్న సర్టిఫికెట్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఓటర్లను ఫూల్స్ చేయడానికి బయల్దేరాడు పవన్. అనంతపురం రైతులకు ఎవరు అండగా నిలబడతారో వాళ్ళకు 2019 ఎన్నికల్లో మద్ధతిస్తానని చెప్పుకొచ్చాడు పవన్. 2019ఎన్నికల సమయంలో అనంతపురం రైతులకు ఏం చేస్తారు అని చెప్పి ప్రధాన పార్టీల నాయకలను అడుగుతాడట పవన్. ఎవరు చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయితే వాళ్ళకు మద్దతిస్తాడట. కానీ పవన్ కళ్యాణ్‌ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే మాత్రం జగన్‌కి మద్దతివ్వడం తప్ప పవన్‌కి మరో ఆప్షన్ లేదు. ఆ రకంగా చూసుకుంటే మాత్రం 2019ఎన్నికల్లో జగన్‌కి మద్దతిస్తా అని పవనే పరోక్షంగా వ్యక్తం చేసినట్టు.

- Advertisement -

అనంతపురం రైతులకు టిడిపి ఏం చేస్తుందో 2019లో పవన్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత చేసే ఉద్ధేశ్యమే ఉంటే ఇప్పుడే చేసి ఉండేవారు చంద్రబాబు. పవన్ మాటల ప్రకారం ప్రస్తుతం అనంతపురం రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాలకు కారణం కచ్చితంగా అధికారంలో ఉన్న చంద్రబాబే అని చెప్పాలి. 2014 నుంచీ కూడా రైతులో కోసం ఏమీ చేయని చంద్రబాబు……2019 తర్వాత చేస్తానంటే మాత్రం ఎలా నమ్మాలి? పవనే మాటల్లోనే అర్థమవుతున్నట్టుగా అనంతపురం రైతుల కష్టాలకు కారణమైన చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వకూడదు. ఇక పవన్‌కి మిగిలింది జగన్ మాత్రమే. ఎందుకంటే కాంగ్రసె్‌కి కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకునే సత్తా కూడా లేదు. బిజెపి కూడా పొత్తుల పార్టీనే. తనది కూడా సేం టు సేం దారి అని పవన్ చెప్పేశాడు. ఇక మిగిలింది జగన్ ఒక్కడే. పవన్‌కి నిజాయితీ ఉంటే 2014 నుంచీ 2019వరకూ అనంతపురం రైతుల కష్టాలకు కారణమైన చంద్రబాబుకు మద్ధతివ్వకూడదు. 2019లో కూడా జగన్‌కి మద్ధతివ్వాలి. కానీ ఆ అవకాశం ఉందంటారా? ఛాన్సే లేదు. ఎందుకంటే జగన్ పాదయాత్రను మరుగుపరచడం కోసమే చంద్రబాబు తరపున ప్రజల్లో షో చేస్తున్న పవన్ జస్ట్ నాలుగు డైలాగులు పేలుస్తుంటాడంతే. అంతా పచ్చ డ్రామా మహత్యం. 2019లో కూడా ఈ డ్రామాలకు ఆంధ్రప్రదేశ్ జనాలకు పట్టం కట్టే అవకాశం ఉందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -