Friday, April 26, 2024
- Advertisement -

బౌల‌ర్ల విజృంభ‌న‌…మూడో టెస్ట్‌లో భార‌త్ ఘ‌న‌విజ‌యం

- Advertisement -

జోహన్స్‌బర్గ్‌లో జరుగుతోన్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అదరగొట్టేశారు. దక్షిణాఫ్రికా వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 241 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆరంభించిన సఫారీలు ఆరంభంలో రాణించినప్పటికీ హషీమ్ ఆమ్లా (52) ఔట్ అయిన తరువాత ఇతర బ్యాట్స్‌మెన్‌లు వరసగా అవుట్ అయిపోయారు. దీంతో స‌ఫారీ బ్యాట్స్‌మెన్‌లు ఎవ్వ‌రూ క్రీజ్‌లో నిల‌బ‌డ‌ల‌క‌పోయారు.

241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన సఫారీలకు చుక్కలు చూపెడుతున్నారు. 157 పరుగులకే ఏడు దక్షిణాఫ్రికా వికెట్లు నేలకూల్చి మ్యాచ్‌పై పట్టుబిగించారు. శనివారం నాల్గో రోజు ఆటలో భాగంగా 17/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్‌ సమయం వరకూ నిలకడగా బ్యాటింగ్‌ చేసింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు డీన్‌ ఎల్గర్‌, హషీమ్‌ ఆమ్లాలు బాధ్యతాయుతంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

ఓపెనర్ ఎల్గర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 86 (నాటౌట్) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్‌మెన్‌లో మార్క్‌రం 4, ఆమ్లా 52, డివిల్లియర్స్ 6, డుప్లెసిస్ 2, డికాక్ 0, ఫిలెండర్ 10, ఆండిలె 0, రబాడా 0, మార్కెల్ 0, ఎన్గిడీ 4 పరుగులు చేశారు.

దీంతో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్‌కి ఒక వికెట్ దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 247 పరుగలకి ఔట్ కాగా దక్షిణాఫ్రికా 177 పరుగులకి ఆలౌట్ అయింది. సిరీస్ స‌ఫారీ కౌవ‌సం చేసుకున్నా వైట్‌వాష్ నుంచి టీమిండియా బ‌య‌ట‌ప‌డింది.

మొద‌ట‌ టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకి ఆలౌటవగా.. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులు చేసింది. దీంతో ఏడు పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 247 పరుగులకి ఆలౌటవగా.. దక్షిణాఫ్రికా 177కే ఆలౌటైంది. దీంతో 63 పరుగుల తేడాతో భారత్ గెలిచింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -