- Advertisement -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోంటుంటె… అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి (JC Dewaker Reddy) వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదన్నారు.. జగన్ నవరత్నాలు లేవు.. నాపరాళ్లు లేవు..! అన్నారు.
తొలిసారి సీఎం అయ్యే అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నారని.., ఇక జగన్‌కు సీఎం అయ్యే అవకాశం లేదని.. జగన్‌ను ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదన్నారు. అలాగే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ పాదయాత్ర ఎలా చేస్తారు.. అంటూ ప్రశ్నించారు.
అనంతపురం ప్రజల కష్టాలు తీరుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, అందుకే రాజీనామా వెనక్కి తీసుకున్నానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.