ఏపీ భాజాపాలో విబేధాలు ముదిరి పాకాన పడ్డాయి. పార్టీలో నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. కన్నా అత్యుత్సాహం ఆయన పదవికి చేటు తెచ్చేలా ఉన్నాయి. ఆయన రాజధాని విషయంలో టీడీపీ కి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ ఒక వర్గం నాయకులు భాజాపా అధిష్టానానికి కన్నాపై ఫర్యాదు చేశారు.
అసలు విషయానకి వస్తే రాజధాని విషయంలో కన్నా తీసుకుంటున్న నిర్ణయాలు సుధీష్ రాంబొట్ల వర్గం గుర్రుగా ఉంది.హైదరాబాద్‌లో ఇద్దరు నేతలు పోటా-పోటీగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కన్నా నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని.. హైదరాబాద్‌లో సుధీష్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారట.
ఇటు హైదరాబాద్‌లో కన్నా లక్ష్మీనారాయణ మరో సమావేశం నిర్వహించారట. రాజధాని కార్యాచరణపై సీనియర్లతో కన్నా చర్చలు జరిపారట. ఈ భేటీలో సుధీష్ రాంభొట్ల వ్యవహార శైలిపై కూడా చర్చించినట్లు జరిగినట్లు తెలుస్తోంది. భేటీకి సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సోము వీర్రాజు, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, సత్యమూర్తి హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం చూస్తుంటె పార్టీలో వర్గ విబేధాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అయితే ఈ విషయం ఎంత వరకు వెల్తుందో …?