Thursday, May 2, 2024
- Advertisement -

చింతమనేని టికెట్‌కు ఎసరు?

- Advertisement -

ఏపీలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమిగా వస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల పంపకాలు తేలి అభ్యర్థుల ప్రకటన జరిగినా ఇంకా దోబుచూలాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒకటి, రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు, సీట్లలో మార్పు జరుగగా తాజాగా మరిన్ని స్థానాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఓ సీటు కావాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు బీజేపీ పెద్దలు. ఇది ఏకంగా దెందలూరు నుండి పోటీ చేస్తున్న చింతమనేనికి ఎసరు పడేలా కనిపిస్తోంది. వాస్తవానికి ఫస్ట్ లిస్ట్‌లోనే చింతమనేని ప్రభాకర్ పేరును ప్రకటించారు చంద్రబాబు.అప్పటి నుండి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

రెండుసార్లు దెందలూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని ఈసారి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా చింతమనేని సీటుకు ఎసరొచ్చి పడింది. దెందలూరు నుండి బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపనా చౌదరిని బరిలోకి దింపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న తపనా చౌదరికి సీటు ఇచ్చేలా బాబుపై ఒత్తిడి తెస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే ఈ ప్రతిపాదన చంద్రబాబు వద్దకు వెళ్లగా దెందలూరును బీజేపీకి ఇస్తే తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిని టీడీపీకి ఇచ్చేలా బీజేపీ సిద్దమైనట్లు తెలుస్తోంది.

అయితే చింతమనేని సైలెంట్ అవుతారా అన్నది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న చింతమనేని..అనేక వివాదాలకు కేరాఫ్. అంతేగాదు ఆయనపై రౌడీ షీట్ కూడా ఉంది. దీంతో ప్రభాకర్‌ని పోటీ నుంచి తప్పించడం టీడీపీకి అంత ఈజీ కాదనే ప్రచారం జరుగుతోండగా త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -