జనసేనుడు పవన్ కళ్యాణ్ జర్నీని పొలిటికల్ సర్క్యూట్ జనాలు నిశితంగా గమనిస్తున్నారు. లాస్ట్ టైమ్ పోటీ చేయాల్సి ఉండగా ఎంతో తెలివిగా తప్పించుకుని టీడీపికి సపోర్ట్ చేసి పార్టీ లైఫ్ టైమ్ ఇంకాస్త పెంచుకున్నాడు. ఒకవేల అప్పుడే పోటీ చేస్తే… అతని బలమేంటో జనాలకు అర్ధమైపోయేది. 2009 ఎన్నికలలో పిఆర్ పి విషయంలో జనాలు ఎలా ఊహించుకుని బొక్క బోర్లా పడ్డారో…. అలాంటి సీన్ రావొచ్చనే ఆలోచనలో ఆనాడు పవన్ తెలివిగా సైడై పోయాడు.
ఈసారి మాత్రం పవన్ తప్పించుకోవడానికి లేదు.పెద్దవాడిగా ఫైట్ చేయడమో లేక పసివాడిగా మారిపోవడమో తేలిపోనుంది. అందుకే జనసేన పార్టీతో పూర్తిస్థాయి ఎన్నికల కసరత్తు చేస్తున్నాడు. జనసేన మీడియా ప్రతినిదులు హరిప్రసాద్ ,నగేష్ లు ఈవిషయంలో కాస్త గట్టిగానే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. పార్టీకి రూట్ లెవెల్ పట్టుకోసం బడుగుల దగ్గరికి వెళదామనుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలలో కాపులు మంచి యాక్టివ్ గా ఉండటం కూడా పవన్ దృష్టికి వెళ్లింది. దీని వలన కులముద్ర పడుతుందని పవన్ ఓ వైపు భయపడుతూనే ఉన్నారట. సీరియస్ గా పార్టీ కోసం పనిచేసేవారు మన వర్గంలో ఉన్నారని..దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని కొందరు చెప్పడంతో ఇక చేసేదేమి లేక పవన్ సై అనేశాడంటున్నారు.
చివరకు వచ్చేసరికి పార్టీ టికెట్ల విషయంలో బిసి,యస్ సి, యస్ టిలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి..కాపులకు కొంత వరకే సీట్లిచ్యే యెచనలో పవన్ ఉన్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేల అదే జరిగితే.. ఇంతకాలం కష్టపడిన మన బతుకులేంటని పవన్ ను కొందరు నిలదీసే పరిస్థితులు రావచ్చు. అందుకోసం కూడా పవన్ రెఢీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేల వైసీపితో పొత్తుపెట్టుకుంటే.. వచ్చే ఫలితాలను కూడా పవన్ చూస్తున్నాడట. ఇక్కడ అందరికీ అర్ధమవుతుంది ఏమిటంటే… పవన్ రూటు ఎక్జాట్ గా ఏమిటనేది సొంతింటి కాపులకే తెలియట్లేదట.ఇక బయట వారికి ఏమి తెలుస్తుంది.