బ్రేకింగ్ : మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్య..!

- Advertisement -

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత హత్య కలకలం రేపింది. మచిలీపట్నంలో వైసీపీ నేత మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు అయినా మోకా భాస్కరరావుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. చేపల మార్కెట్ కు వెళ్లిన భాస్కరరావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తితో పొడిచి పారిపోయారు.

దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన భాస్కరరావును అక్కడ స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కత్తికి సైనేడ్ పూయడంతో చికిత్స పొందుతూ భాస్కరరావు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు ప్రతక్ష స్యాక్షులు చెబుతున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే భాస్కరరావును హత్య చేశారని.. ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

కాగా ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భాస్కర రావు హత్య వార్త తెలుసుకొని వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

విశాఖ నుంచే పరిపాలన.. జగన్ ఫిక్స్..!

ఎందుకయ్యా చిట్టినాయుడూ.. గొడవలోకి మీ ఆవిడను లాగుతావ్ : విజయ సాయి

వైసీపీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ : వైసీపీలోకి 5 ఎమ్మెల్సీలు జంప్

ఉచితంగా ఇసుక పంపిణీ : జగన్ సంచలన నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -