Thursday, May 9, 2024
- Advertisement -

కువైట్‌లో అరెస్టైన రోజా… ఖండించిన రోజా…

- Advertisement -

కువైట్‌లో నవరత్నాల సమావేశం స్థానిక హోటల్‌లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు. భేటీకి హాజరైన 2 వేల మంది కార్యకర్తలు. సమావేశం లో పాల్గోన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా… సమావేశానికి అనుమతి లేదని అడ్డుకున్నా కువైట్‌ పోలీసులు… సమావేశంలో కార్యకర్తలు పార్టీ నినాదాలు చేయడంపై అదుపులోకి తీసుకున్నారు కువైట్‌ పోలీసులు… ఆయితే ఈ క్రమంలో ఉన్న రోజాను కూడా వారు అదుపులోకి తీసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే రోజా కువైట్‌లో తాను అరెస్టయ్యానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాను ఇంటిలోనే ఉన్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వార్తలను ఎవరు, పుట్టించారో, ఎందుకు పుట్టించారో తనకు తెలియదని, తానైతే హ్యాపీగానే ఉన్నానని, తననెవరూ అరెస్ట్ చేయలేదని అందులో పేర్కొన్నారు.

ఈ వార్త పలు చానెళ్లలో రావడంతో రోజా స్పందిస్తూ వీడియోను పోస్ట్ చేశారు. తాను ఇక్కడ బాగానే ఉన్నానని, తననెవరూ అరెస్ట్ చేయలేదని తెలిపారు. నవరత్నాల మీటింగ్ విజయవంతంగా జరిగిందని పేర్కొన్నారు. గుంపులుగా ఉండడం ఇక్కడి చట్టాలకు వ్యతిరేకం కావడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తాను ఇక్కడికి అతిథిగా మాత్రమే వచ్చానని, ఏదైనా ఉంటే నిర్వాహకులు, పోలీసులు చూసుకుంటారు తప్ప తనకేమీ సంబంధం లేదని రోజా ఆ వీడియోలో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -