పిల్లికి చెలగాటం..ఎలుకకి ప్రాణసంకటం ఇది సామెత…కాని నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.బాబులో టెన్సన్ పీక్ స్టేజికి వెల్తే ..అఖిల మాత్రం తనకు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తోంది.ఉప ఎన్నికను రెండు పార్టీలు ఎంత ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయే అందరికి తెలిసిందే.
ఎన్నికల నోటిఫికేషణ్ ఇంకా వెలువడకముందె రెండు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని దుమ్మురేపుతున్నాయి. ఇక ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో ? ఎంత టెన్షన్ పడుతున్నారో? ప‌్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా చంద్రబాబు కెరీర్‌కే అది పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చే అంశంపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.ఎంతైనా ఈ ఉప ఎన్నిక రెఫరెండమ్ లాంటిదే.
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు ఇక్కడ ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు, 6 గురు మంత్రులను రంగంలోకి దించారంటే ఆయనలో ఎంత భయం పట్టుకుందో అర్థమవుతోంది.దానికితోడు చినబాబులోకేష్ ఒకసారి.చంద్రబాబు రెండు సార్లు నంద్యాలలో చక్కర్లు కొట్టారు.అభ్యర్తిగెలుపుపై ఆపసోపాలు పడుతుంటె..అఖిల మాత్రం తనకేం పట్టనట్టు లైట్ తీసుకుంటోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.చంద్రబాబు తెప్పించుకున్న అన్ని నివేదికలలోను అఖిలకు వ్యతిరేకంగా పిర్యాదులు వచ్చాయి.
అఖిలప్రియకు రాజకీయానుభవం లేకపోవడంతో పాటు ఆమె ఎన్నిసార్లు చెప్పినా టీడీపీ శ్రేణులను కలుపుకుని వెళ్లకపోవడం, భూమా గతంలో ఎంతో ప్రయారిటీ ఇచ్చిన సీనియర్లను పక్కన పెట్టేయడం లాంటి అంశాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని టీడీపీ శ్రేణులు బాబుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఒకరిద్దరితో కోటరీ ఏర్పాటు చేసుకుని వాళ్లు చెప్పినట్టు నడుచుకోవడం, ఆమె చేస్తోన్న పనులు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో నంద్యాలలో టీడీపీ శ్రేణులు అఖిలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
ఇక దివంగత భూమా రైట్ హ్యాండ్ ఏవీ.సుబ్బారెడ్డిని అఖిల పట్టించుకోకపోవడంతో చివరకు ఆయన తీవ్ర అసంతృప్తితో పార్టీ మారే వరకు వ్యవహారం వెళ్లింది. ఇలానె ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన బాబు ఎన్నికల ప్రచార బాధ్యతలను మంత్రులకు అప్పగించారు.దాంతో అఖిల అప్పటినుంచి ఎన్నికను లైట్‌గాతీసుకుంటోంది.అఖిలప్రియ తీరుతో విసిగిపోయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆమెను పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ శ్రేణులు అంటున్నాయి.