రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ జోడో యాత్రను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకోచ్చేందుకు చేపట్టిన ఈ యాత్రపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తుండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇక ప్రస్తుతం రాహుల్ యాత్ర కర్నాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో భాగంగా మైసూర్ లో ఏర్పాటు చేసిన భాహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు.. అయితే రాహుల్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది.
అయినప్పటికి రాహుల్ తన ప్రసంగాన్ని ఆపకుండా వర్షంలో కూడా అలాగే కొనసాగించారు. దేశ గొంతుక వినిపించడంలో తనను ఎవరు అపలేరని.. రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇక గతంలో మోడీ తన ప్రసంగంలో వర్షం పడుతున్నప్పుడు గొడుగు పట్టించుకున్న ఫోటోను.. రాహుల్ వర్షంలో కూడా తన ప్రసంగాన్ని ఆపకుండా ప్రసంగిస్తున్న ఫోటోను కాంగ్రెస్ తన ట్విట్టర్ పెడుతూ.. ” మోడీ యాక్టర్ .. రాహుల్ మాస్ లీడర్ ” అంటూ హిందీలో రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్స్ బిన్నంగా స్పందింస్తున్నారు. కొంత మంది రాహుల్ కు సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరికొంత మంది మోడీకి అండగా నిలుస్తున్నారు. ఇక రాహుల్ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 24 నుంచి తెలంగాణలో మొదలు కానుంది.. 13 రోజులపాటు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. వచ్చే నెల 7 వ తేదీన మునుగోడు బై పోల్ ఉన్న నేపథ్యంలో రాహుల్ తెలంగాణ మీదుగా పాదయాత్ర చేపట్టడం ప్రదాన్యం సంతరించుకుంది.
Also Read