ఏపీలో మూడు రాజధానుల చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకు కోర్టు అడ్డంకులు, అమరావతి రైతుల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు.. ఇలా సాగిన త్రీ క్యాపిటల్స్ అంశం.. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనే కొత్త కన్ఫ్యూజన్ తెరపైకి వచ్చింది. ఆ మద్య ఏపీ రాజధాని విశాఖ కాబోతుందంటూ సిఎం జగన్ ప్రకటించడంతో ఈ కన్ఫ్యూజన్ కు తెరలేచింది. దాంతో ఎన్నో అడ్డంకులు ఉన్న మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి కేవలం విశాఖపట్నంనే రాజధానిగా ప్రకటించబోతున్నారా అన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. .
విశాఖనే రాజధాని అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ కూడా చెప్పడంతో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గిందా అనే ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ సర్కార్ యొక్క నిలకడలేమి నిర్ణయాలపై టీడీపీ జనసేన పార్టీలు గట్టిగానే విరుచుకుపడుతున్నాయి. అసలు ఏపీ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు.. రాజధాని విషయంలో ఎన్నిసార్లు మాట మారుస్తారు. ఏపీ రాజధాని ఏదో ప్రపంచానికి కమ్యూనికేట్ చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అంటూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చన్నాయుడు ట్విట్టర్ లో ఘాటు విమర్శలు చేశారు. అటు జనసేన కూడా దీనిపై ఘాటు విమర్శలు చేస్తోంది.
దీంతో త్రీ క్యాపిటల్స్ విషయంలో ప్రజలు కూడా కాస్త గందరగోళానికి గురవుతున్నారు. దీంతో త్రీ క్యాపిటల్స్ విషయంలో మరోసారీ క్లారిటీ ఇచ్చింది జగన్ సర్కార్. తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉండని అందులో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రాజకృష్ణరెడ్డి స్పష్టం చేశారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదెలేదు అని మంత్రి అంబటి రాంబాబు కూడా స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, విశాఖతో పాటు కర్నూల్, అమరావతి కూడా రాజధానిగా ఉంటాయని బుగ్గన రాజేంద్రనాథ్ తాజాగా వివరణ ఇచ్చారు. దీంతో త్రీ క్యాపిటల్స్ విషయంలో నో కన్ఫ్యూజన్ అంటూ వైసీపీ చెబుతోంది. కాగా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండడంతో ఈలోపు త్రీ క్యాపిటల్స్ ను జగన్ సర్కార్ అమలు చేస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read
రిషికొండ గ్రీన్ మ్యాట్.. జగన్ గ్రాఫిక్స్ గురూ !