వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత వైజాగ్ లోని రిషికొండ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రకృతి అందాలతో కనివిందు చేసిన రిషికొండ ప్రస్తుతం తవ్వకాల కారణంగా దాని రూపురేఖలే మారిపోయాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎడతెరిపి లేకుండా కొండ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అసలెందుకు రిషికొండ తవ్వాలకు చేస్తున్నారు అని అడిగితే సమాధానం మాత్రం మిస్టరీగానే ఉంది. ఇప్పటికే భారీ ఎత్తున తవ్వకాలు జరిపి అక్కడ కట్టడాల నిర్మాణం కూడా జరుగుతోంది. రిషికొండ వ్యవహారంలో ప్రభుత్వంపై విపక్షాలు తరచూ ఎన్నో విమర్శలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన వచ్చింది లేదు. .
అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని, భూకబ్జా లకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలపై నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయినప్పటికి వైసీపీ నేతలు మాత్రం ఏం వినపడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రిషికొండ తవ్వకాల వ్యవహారం ఏకంగా హైకోర్టు వద్దకు చేరింది. రిషికొండలో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు.. అక్కడి పనులను తనిఖీ చేసేందుకు అధికారులను నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలా సౌగుతున్న రిషికొండ వ్యవహారం..తాజా పరిణామాలు కొత్త చర్చలకు తావిస్తోంది. రిషికొండపై జరిపిన తవ్వకాలపై తాజాగా గ్రీన్ మ్యాట్లు దర్శనమిస్తున్నాయి.
దాంతో అసలేందుకు ఈ గ్రీన్ మ్యాట్లు అనే సందేహాలు అందరిలోనూ మెదలుతున్నాయి. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తనదైన రీతిలో స్పందించారు. తమ ప్రభుత్వం రిషికొండపై జరిపిన తవ్వకాలను రాజమౌళి గ్రాఫిక్స్ లో మాదిరి కవర్ చేయబోతున్నారంటూ సెటైరికల్ గా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు రఘురామ. కేంద్ర దర్యాప్తు సంస్థలు త్వరలో రానుండడంతో వారికి గ్రాఫిక్స్ లో అందమైన రిషికొండను చూపించేందుకే జగన్ ప్రయత్నం అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఇక చాలమందిలోనూ ఇదే అభిప్రాయం ఉంది. అయితే ఒరిజినల్ ఏదో గ్రాఫిక్స్ ఏదో తెలుసుకోలేని స్థితిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఉంటుందా ? రిషికొండ పై గ్రీన్ మ్యాట్లు పరిచి జగన్ సర్కార్ ఇస్తున్న సందేశం ఏంటి అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. మొత్తానికి తవ్వకతో అందాన్ని కోల్పోయిన రిషికొండకు గ్రాఫిక్స్ తో కొత్త రూపు తీసుకోస్తున్నని సిఎం జగన్ పై సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి
కేసిఆర్ ను దేశ ప్రజలు నమ్ముతారా ?
