Sunday, April 28, 2024
- Advertisement -

ఒకే రాజధానా.. మూడు రాజధానులా ఏంటి ఈ కన్ఫ్యూజన్ ?

- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని గత ప్రభుత్వం క్యాపిటల్ సిటీగా ప్రకటించింది. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ది చేయాలనే భావనతో త్రీ క్యాపిటల్స్ నినాదాన్ని అందుకున్నారు. అయితే మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై అటు విపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. అయినప్పటికి త్రీ క్యాపిటల్స్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని వైసీపీ సర్కార్ మొండి పట్టు పట్టింది..

అయితే అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ” త్రీ క్యాపిటల్స్ వద్దు.. ఒకే రాజధాని ముద్దు జే‌జే” అనే నినాదంతో ఇప్పటీకి ఆందోళనలు చేస్తూ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. మరోవైపు భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే వరకు త్రీ క్యాపిటల్స్ ను అనుమతి ఇచ్చేదే లేదని హైకోర్టు స్టే ఇస్తూ జగన్ సర్కార్ నిర్ణయానికి అడ్డుకట్ట వేసింది. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి మూడు రాజధానులే మా ధ్యేయం అంటూ వైసీపీ నేతలు తరచూ చెబుతూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే ఇటీవల డిల్లీలో జరిగిన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సి‌ఎం జగన్ మాట్లాడుతూ త్వరలో విశాఖ రాజధాని కాబోతుందని, తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నాట్లు అనౌన్స్ చేసి కొత్త సందేహాలకు తెరతీశారు.

ఇప్పటివరకు మూడు రాజధానులపై జరిగిన చర్చ.. ఇప్పుడు విశాఖా మాత్రమే రాజధానిగా మారబోతుందా అనే సందేహాలు అందరి మదిలోను మెదులుతున్నాయి. అయితే రాజధాని విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో సి‌ఎం జగన్ విశాఖ రాజధాని అంటూ చెప్పడం కోర్టు దిక్కరణే అవుతుందని కొందరి అభిప్రాయం. ఒకవేళ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సి‌ఎం జగన్ విశాఖాను రాజధానిగా ప్రకటిస్తే శిక్షార్హులు కావడం ఖాయం. అయితే మూడు రాజధానుల ప్రకటనపై కేసు నడుస్తున్న నేపథ్యంలో ముందుగా విశాఖాను అనధికారంగా రాజధానిగా చేసి.. ఆ తరువాత కోర్టు అడ్డంకులు అన్నీ తొలగిపోయిన తరువాత అధికారికంగా మూడు రాజధానుల ప్రకటన చేసే విధంగా జగన్ ప్రణాళిక వేశారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. అయితే ఏపీ త్రీ క్యాపిటల్స్ విషయంలో సి‌ఎం జగన్ ఆడుతున్న కన్ఫ్యూజన్ గేమ్ ఎలా ఎండ్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సొంత నేతల దెబ్బ.. జగన్ కు గట్టిగా తాకిందా ?

మోడీ పాలనపై.. ప్రజా నాడీ ఏం చెబుతోంది ?

బాబు, పవన్, లోకేశ్.. మీలో ఎవరు సి‌ఎం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -