Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబుకు హ్యాండిచ్చిన జూనియర్ ఎన్టీఆర్!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్…ఇప్పుడు టీడీపీ, ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. ఎన్టీఆర్ టీడీపీలోకి తిరిగి రావాలని, కీలక బాధ్యతలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఇది ఏ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బ్రతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిన పరిస్థితి. దీంతో ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్‌ని పార్టీలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఇన్‌సైడ్ టాక్.

అయితే ఈ విషయంలో బాబు అండ్ టీంకు తీవ్ర నిరాశ ఎదురైంది. తిరిగి పార్టీలోకి రావాలని చంద్రబాబు సన్నిహితులు ఎన్టీఆర్‌ను సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. తాను ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నానని….ఒక పార్టీ ముద్ర తనపై పడటం ఇష్టం లేదని చెప్పారట జూనియర్ ఎన్టీఆర్.

అందుకే ఇటీవల ఢిల్లీలో ఎన్టీఆర్ నాణేం విడుదల కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు జూనియర్. ఇక రీసెంట్‌గా హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాగా అప్పుడు కూడా రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఇప్పట్లో రాజకీయాలకు వచ్చే ఉద్దేశమే లేదని ఎన్టీఆర్ చెప్పడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం సంగతి పక్కన పెడితే కనీస స్ధానాలు దక్కకపోతే టీడీపీ ఉనికి కొల్పోయే ప్రమాదం ఉంది. దీంతో పార్టీని ఎలా గట్టెక్కించాలోనని తీవ్ర సమాలోచనలు జరుపుతున్నారట బాబు.

ఏదిఏమైనా టీడీపీకి ఇది నిజంగా గడ్డుకాలమే. ఎందుకంటే ఓ వైపు ఎన్నికలకు టైం దగ్గరపడుతోంది. మరోవైపు ఐటీ నోటీసులు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ తరపున ప్రచారం నిర్వహించేది లేదని జూనియర్ ఎన్టీఆర్ తేల్చిచెప్పడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -