Friday, May 17, 2024
- Advertisement -

ఏపీ క్రాస్ రోడ్స్‌లో పవన్‌!

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో రోజురోజుకు హీట్ పెరిగిపోతోంది. ముఖ్యంగా వైసీపీ ఎదుర్కొనేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన జట్టుకట్టేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పటికే జనసేన- బీజేపీ మైత్రి కన్ఫామ్ కాగా ఈ జట్టులోకి టీడీపీ చేరుతుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

అయితే తాజాగా రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం చంద్రబాబు..బీజేపీతో కంటే పవన్ ఒక్కడితోనే పొత్తుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి బీజేపీతో దగ్గరయ్యేందుకు బాబు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ మాత్రం టీడీపీ పట్ల అంత ఇంట్రెస్ట్‌గా లేదు. దీంతో బాబుకు ఉన్న ఏకైక దిక్కు పవన్ మాత్రమే.

ఇక ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న పవన్ ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అడుగుపెట్టాలని ధృడనిశ్చయంతో ఉన్నారు. సీఎం అవడం సంగతి పక్కనపెడితే ఎమ్మెల్యే కావడం పవన్ ముందుకు లక్ష్యం. తద్వారా కనీసం ఎమ్మెల్యే కాలేకపోయాడన్న విమర్శలకైనా చెక్ పెట్టాలని భావిస్తున్నారు జనసేనాని.

ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి పోటిస్తే తనకు మంచే జరుగుతుందని ఇప్పటివరకు భావించిన పవన్‌కు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మింగుడు పడటం లేదు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఐటీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ కలిసి పోటిచేయడం అంత ఈజీగా కనిపించడం లేదు. దీంతో క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డ పవన్‌కి టీడీపీ వైపు వెళ్లాలా లేదా బీజేపీతో వెళ్లాలా అన్నది మిలియన్ డాలర్లగా ప్రశ్నగా మిగిలిపోయింది. ఎలాగైన తమ నాయకుడిని అసెంబ్లీలో చూడాలనుకుంటున్న పవన్ ఫ్యాన్స్‌కి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మింగుడు పడటం లేదు. ఈసారైనా తమ నాయకుడు MLA Pawanగా మారుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -