Monday, April 29, 2024
- Advertisement -

బాలయ్య ప్లస్,మైనస్…వీడియో పాతదే కానీ!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ స్టార్లు చంద్రబాబు అరెస్ట్‌ని ఖండించగా ఎన్టీఆర్‌ మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయారు. ఇదే ప్రశ్న టీడీపీ నేతలకు ఎదురవుతోంది. టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి రిపోర్టర్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. కొంతమంది ఈ ప్రశ్నను దాటవేస్తే మరికొంతమంది మాత్రం ఎందుకు స్పందించడం లేదో ఎన్టీఆర్‌నే అడగండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

వాస్తవానికి ఎన్టీఆర్ తిరిగి పార్టీలోకి వస్తే జోష్ వస్తుందని కొంతమంది నేతలు భావిస్తున్న పైకి చెప్పలేని పరిస్థితి. కానీ ఎన్టీఆర్‌ పార్టీలోకి రావడం కొంతమంది మెయిన్ లీడర్లకు ఇష్టం లేదు. అందుకే ఆయన స్పందించినా, స్పందించకపోయినా లైట్‌ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు టీడీపీకి గ్యాప్ మరింత పెరిగేలా గతంలో నందమూరి కుటుంబసభ్యులు జూనియర్ గురించి చేసిన కామెంట్స్ వీడియోని వైరల్ చేస్తున్నారు.

2021లో తన పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి స్పందించిన వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో తారక్ రాజకీయాల్లోకి రావడం బాలయ్యకు ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. తారక్ వస్తే పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అయితే అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు. అంతేగాదు ప్లస్ అంటే ప్లస్ మైనస్ అంటే మైనస్, ప్లస్ మైనస్ అంటూ అర్ధం కాని భాషలో ఎన్టీఆర్‌పై వ్యతిరేకతను బయటపెట్టారు బాలయ్య. ఇక బాలయ్య చేసిన ఈ కామెంట్స్‌ అల్లుడు నారా లోకేష్ కోసమేనని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పార్టీలో ప్రొజెక్ట్ అవుతున్నారు నారా లోకేష్. అలాగే బాలయ్య మరో అల్లుడు భరత్ రాజకీయాల్లో ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తారక్ పార్టీలోకి వస్తే వీళ్లకు ఇబ్బంది అవుతుందని భావించిన బాలయ్య ఈ విధంగా కామెంట్స్ చేసినట్లు అర్ధం అవుతోంది. వీడియో పాతదే అయిన ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు చక్కగా సెట్ అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -