వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసు కేసులతో పడరాని పాట్లు పడుతున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ పోలీసులు ఆయ పై కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా బైక్ ర్యాలీ చేశారని ఈ క్రమంలో కేసు నమోదు చేశామని ఏలూరు డిఎస్పీ కిరణ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదవేగి మండలం వేగివాడలో తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి చింతమనేని ప్రభాకర్ బైక్ ర్యాలీ నిర్వహించారని తెలిపారు. ఈ నేపథ్యంలో చింతమనేని, ఆయన అనుచరులు కొందరిపై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా, చింతమనేని ఆయన అనుచరులను స్టేషన్ కు పిలిపించి పోలీసులు విచారణ చేశారు. ఈ మేరకు పెదవేగి ఎస్సై సుధీర్ చింతమనేనికి 41 ఏ నోటీసులు జారీ చేశారు. ఇదిలావుండగా చింతమనేనిపై ఇప్పటికే ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి.
Also Read
ఆంధ్ర ప్రదేశ్ లో ఓటు వేయకండి: ఒడిశా పోలీసులు
షర్మిల నిర్ణయం… బాబు నోటి నుంచి ఆ మాట..!
తమ్ముడికి భావోద్వేగ లేఖ రాసిన సుప్రీం హీరో సాయి తేజ్
ఉదయభాను సినీ ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం ఏంటి ?